NTV Telugu Site icon

Hot Water Bath: వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. ఇలా చేస్తే మాత్రం ప్రమాదమే!

Hot Water Problems

Hot Water Problems

Hot Water Bath Will Cause Several Health Problems: చలికాలంలో ప్రతిఒక్కరూ వేడి నీళ్లతో స్నానం చేయడాన్నే ప్రిఫర్ చేస్తారు. చల్లటి వాతావరణంలో వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే.. ఆ మజానే వేరు. అదొక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అయితే.. కాస్త వెచ్చగా ఉన్న నీళ్లతో స్నానం చేస్తే పర్వాలేదు. కానీ.. మరీ వేడి నీళ్లతో స్నానం చేస్తే మాత్రం, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికాకు చెందిన ఓ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హెచ్చరిస్తున్నారు. మరీ వేడి నీళ్లతో స్నానం చేస్తే.. చర్మంలోని తేమ పోయి, చర్మం పొడిబారిపోతుందని అంటున్నారు. అంతేకాదు.. జుట్టు పెరుగుదల మందగిస్తుందని, శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా సైతం నశిస్తుందని చెప్తున్నారు. అలా మంచి బ్యాక్టీరియా నశిస్తే.. చర్మంపై పగుళ్లు, దురద సమస్యలు వంటివి ఎదురవుతాయని పేర్కొంటున్నారు.

Pale Thief: పాపం లేత దొంగ.. ఈదుకుంటూ పోదాం అనుకున్నాడు.. కానీ ఇరుక్కుపోయాడు

ఇంకా ఆ డాక్టర్ ఏమన్నారంటే.. ‘‘మన చర్మంలో నుంచి ఆయిల్ ఉత్పత్తి అనేది సహజంగానే అవుతంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది. ఒకవేళ వేడి నీళ్లతో స్నానం చేస్తే.. ఈ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోతుంది. తద్వారా చర్మం పొడిబారి, కొత్త సమస్యలు వస్తాయి. మొటిమలు ఉన్నవాళ్లు వేడి నీళ్లతో స్నానం చేస్తే, మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొటిమలు మరింత పెరిగే అవకాశం ఉంది. చర్మానికి మేలు చేసే బ్యాక్టీరియా నశించి, చర్మ సమస్యలు పెరుగుతాయి. నీళ్లు మరీ వేడిగా ఉంటే.. తలపై రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది. దీనివల్ల జుట్టు పెరగుదల మందగించడంతో పాటు జుట్టు రాలడం మరింత పెరుగుతుంది. వేడి నీళ్లు.. నరాలకు హాయిని కలిగించినప్పటికీ, రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. హైపర్ టెన్షన్‌కు కూడా కారణం అవుతుంది’’ అంటూ వివరించారు.

Constable Shalini Chauhan: లేడీ కానిస్టేబుల్‌కి హ్యాట్సాఫ్.. స్టూడెంట్‌గా మారి, ఆ కేసుని ఛేధించింది

ఇవే కాదు.. మరికొన్ని సమస్యలూ ఉన్నాయి. వేడి నీళ్లతో స్నానం చేస్తే.. బాత్రూమ్ నుండి బయటకొచ్చిన వెంటనే నిద్రపోవాలనే భావన కలుగుతుంది. అంటే, ఇది నీరసంగా మార్చేస్తుంది. నిత్యం యవ్వనంగా కనిపించాలని అనుకునేవారు.. వేడి నీళ్లకు దూరంగా ఉంటే ఉత్తమం. లేకపోతే.. చర్మంపై త్వరగా ముడతలు వచ్చేస్తాయి. యవ్వనంలోనే ముసలివారిలా కనిపిస్తారు. ఒకవేళ 30 నిమిషాల కంటే ఎక్కువగా వేడి నీళ్లతో స్నానం చేస్తే.. అది సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని కూడా ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి.. వేడి నీళ్లతో స్నానం చేసేవారు తస్మాత్ జాగ్రత్త.

Dry Cough: పొడి దగ్గు తగ్గట్లేదా.. ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం