NTV Telugu Site icon

Holi Thandai: హోలీ స్పెషల్ తాండై బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

Thandai Recipe

Thandai Recipe

మన భారత దేశంలో ప్రజలంతా కలిసి జరుపుకొనే పండుగలలో హోలీ కూడా ఒకటి.. వయసు సంబంధం లేకుండా అందరు సంతోషంగా జరుపుకుంటారు.. ఈ పండుగ అంటే ఒక సరదా.. ఈ ఏడాది మార్చి 25 న హోలీ పండుగను జరుపుకుంటున్నాం.. ఈ పండుగ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. హోలీకా దహనం చేస్తారు.. అనంతరం రంగులతో సంబరాలు చేసుకుంటారు.. హాలికి రంగులు మాత్రమే కాదు.. పిండి వంటలు కూడా చేసుకుంటారు.. అందులో తాండై చాలా ప్రత్యేకమైనది.. రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కూడా ఇస్తుంది.. ఈ డ్రింక్ ను ఎలా చేసుకోవాలి.. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తాండై ని ఎలా తయారు చేస్తారు?

ఒక పాత్రలో కాచి చల్లార్చిన పాలను తీసుకొని అందులో కుంకుమపువ్వు, గులాబీ రేకులను వేయాలి. మిగిలిన డ్రై ఫ్రూట్స్, సోపు, ఎండుమిర్చి కొన్ని నీటిలో ఒక గంటపాటు నానబెట్టండి.. ఆ తర్వాత మెత్తగా పేస్ట్ చేసి పాల మిశ్రమంలో వేసి బాగా కలపాలి . ఈ మిశ్రమాన్ని ఓ అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగితే చాలా మంచిది..

ఆరోగ్య ప్రయోజనాలు..

తాండై శరీరానికి శక్తిని అందించడానికి పనిచేస్తుంది. తాండై పాలు, డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేస్తారు.. అలసటను వెంటనే దూరం చేస్తుంది. అలాగే వెంటనే శక్తిని ఇస్తుంది.. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది.. అంతేకాదు సోంపు వెయ్యడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది.. ఒంట్లో వేడిని తగ్గించడంలో సహాయ పడుతుంది… వేసవిలో ఈ డ్రింక్ ను తాగడం వల్ల వడ దెబ్బ నుంచి బయటపడవచ్చు.. చర్మం మృదువుగా, అందంగా మారుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments