Site icon NTV Telugu

Heart Attack: గుండెనొప్పి ఎప్పుడైనా రావొచ్చు.. ఈ ఒక్క ట్యాబ్లెట్ మీ ఇంట్లో ఉంచుకోండి..!

Heart Attack

Heart Attack

ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. గుండెపోటు నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారి జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది ప్రతి యువకుడి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్నగా మారుతోంది. ఇందులో ప్రధాన కారణం రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించడం వల్ల గుండెపోటు కేసులు యువతలో తరచుగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. గుండెనొప్పి రావడానికి ప్రధాన కారణాలు మనందరికీ తెలిసినవే. పెద్దవారిలోనైనా, యువతలో అయినా.. ఒకేలా ఉంటాయి. తినే ఆహారంపై నియంత్రణ లేకపోవడం, శారీరక వ్యాయామం చేయకపోవడం, ఒత్తిళ్లు, ఆందోళనలు, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్ల వల్ల గుండెపోటు సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కలిసి మొదట్లో బరువు పెరగడానికి కారణం అవుతాయట. ఆపై మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యల్ని తెచ్చిపెట్టి చివరికది గుండె రక్తనాళాల్లో బ్లాకుల్ని తెచ్చిపెట్టే కరోనరి ఆటరీ డిసీస్‌కు దారి తీస్తాయట. ఒకవేళ యుక్త వయసులో గుండెపోటు వస్తే తొందరగా గుర్తించలేమట. లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా విరుచుకు పడి ప్రాణాంతంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

READ MORE: Asaduddin Owaisi: ఓటర్ లిస్ట్‌లో విదేశీయులు కనిపిస్తారు.. పహల్గాం ఉగ్రవాదులు మాత్రం కనిపించరా..?

కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో గుండె నొప్పి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. గుండె పోటు వచ్చేటప్పుడు మొదటగా అరగంట లేదా అంతకంటే ముందు ఛాతీలో నొప్పి మొదలవుతుందట. సాధారణంగా ఎడమ చేతిలోనూ నొప్పి వస్తుంది. ఆ వెంటనే విపరీతంగా చెమటలు పడతాయి. నొప్పి వచ్చే సమయంలో ఎడమ చేయి లేదా కుడి చేయి లాగడం, మొండెం, ఛాతి దవడ నొప్పితో కుడి వైపు ఎక్కువగా రావడం వంటి అంశాలను గమనించవచ్చు. ఈ నొప్పి 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంటే వెంటనే అనుమానించాలి. అయితే ఇలాంటి నొప్పి మొదటిసారిగా శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉందో? లేదో? అనే విషయాన్ని గమనించాలి. ఈ సమయంలో బాధితుడు అస్సలు భయపడకూడదు. ముందుగా సార్బిట్రేట్(5 ఎంజీ నుంచి 10 ఎంజీ) ట్యాబ్లెట్ ను నాలుక కింద పెట్టుకుని చప్పరించాలట. ఈ మెడిసిన్‌ని ఉంచడంతో అది కరిగిపోతుందట. అక్కడ ఉన్న కణజాలం ద్వారా రక్తంలోకి కలిసిపోతుందట. దీనిలో ఐసోసోర్బైడ్ డైనిట్రేట్ నైట్రేట్లు అనే ఔషధాల సమూహం ఉంటుంది. ఐసోసోర్బైడ్ డైనిట్రేట్ రక్త నాళాలను పెద్దదిగా చేస్తుంది (విస్తరిస్తుంది). దీని వలన రక్తం ద్వారా రక్తం ప్రవహించడం సులభం అవుతుంది. గుండె రక్తం పంప్ చేయడం సులభం అవుతుంది. ఇది గుండె మీద ఒత్తిడి తగ్గిస్తుందట.

READ MORE: Ambati Rambabu: గతేడాది చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. విభజన సమస్యల పరిష్కారంపై కమిటీ ఎక్కడ..?

నోట్: వైద్యుడి సూచన మేరకు ఈ ట్యాబ్లెట్‌ని వినియోగించాలి. పైన ఇచ్చిన సమాచారం వివిధ వెబ్‌సైట్ల ద్వారా  తీసుకున్నాం..   

 

 

Exit mobile version