ప్రస్తుతం సమాజంలో ఉన్న బిజీ లైఫ్ తో చాలామంది తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. బయటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ విపరీతంగా తినడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే కొంతమంది రోజు ముక్క లేకుండా భోజనం చేయరు. ప్రస్తుతం ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. అయితే.. తరచుగా చికెన్ తినేవారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని వైద్యులు సూచిస్తున్నారు.
మటన్ ధరలు పెరగడంతో సహజంగానే చాలా మంది చికెన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే చికెన్ వండేటప్పుడు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే అనారోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చికెన్ షాప్ నుంచి తీసుకువచ్చిన మాంసాన్ని వండే ముందు ఒకసారి ఉప్పుతో కడగాలని సూచిస్తున్నారు. దాంతో చికెన్‌పై ఉండే మలినాలు, కొంతమేర బ్యాక్టీరియా తొలగి మాంసం శుభ్రంగా, తాజాగా ఉంటుంది. స్కిన్‌లో ఎక్కువగా కొవ్వు, అనవసరమైన మలినాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే వీలైతే స్కిన్‌లెస్ చికెన్ మాత్రమే తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
చికెన్‌ను కనీసం 74°C (డిగ్రీల సెల్సియస్) వరకు పూర్తిగా ఉడికించాలని న్యూట్రిషియన్లు సూచిస్తున్నారు. ఈ ఉష్ణోగ్రత వద్ద ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తిందని. చికెన్ కడగకపోయినా, దీన్ని సరైన వేడితో బాగా ఉడికిస్తే ఎలాంటి సమస్య ఉండదంటున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు:
మటన్‌తో పోలిస్తే చికెన్ త్వరగా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ వయస్సు వారు అయినా చికెన్‌ను మితంగా తీసుకుంటే మంచిదేనంటున్నారు. శుభ్రంగా వండిన చికెన్ తీసుకోవడం వల్ల స్కిన్ అలర్జీలు, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి అని నిపుణులు చెబుతున్నారు.
