Site icon NTV Telugu

Bowel Cancer: షాకింగ్ అధ్యయనం.. మాంసం, మద్యం తాగే యువతకు పెద్దపేగు క్యాన్సర్..!

Cancer

Cancer

Bowel Cancer: ఇంతకుముందు క్యాన్సర్ అనగానే వయసు పైబడిన వాళ్లకే వస్తుందిలే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలోనూ క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్నామంటున్నారు డాక్టర్లు. అదే కోవలోకి వస్తుంది బోవెల్ క్యాన్సర్ లేదా కొలన్ క్యాన్సర్. దీన్నే పేగు క్యాన్సర్ అని కూడా అంటారు. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వాళ్లలో కనిపించే పేగు క్యాన్సర్ కేసులు ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ లాన్సెట్ విడుదల చేసిన తాజా నివేదిక చెబుతోంది.

READ MORE: CM Revanth Reddy : ఆకస్మికంగా ట్యాంక్‌బండ్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

పెద్దపేగు క్యాన్సర్ల పెరుగుదలకు కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు గానీ పర్యావరణ అంశాలు, ఆహారం, జీవనశైలి దోహదం చేసే అవకాశమున్నట్టు పలు అధ్యయనాల సమీక్షలో తేలింది. ఆహార ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా తినటం.. ఊబకాయం, వ్యాయామం చేయకపోవటం, మద్యం అతిగా తాగటం, తీపి పానీయాలు, సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువుల వంటివి పేగు బ్యాక్టీరియా మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు ఇది సూచిస్తోంది. రోగనిరోధక వ్యవస్థ వాపుప్రక్రియ అనుకూల ప్రతిస్పందనలను సృష్టించటమూ ముందుగానే క్యాన్సర్‌ తలెత్తటానికి దారితీస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

READ MORE: Shocking Crime: స్నేహితుడితో చూడకూడని స్థితిలో భార్య.. మరణశాసనం రాసిన భర్త..

Exit mobile version