Site icon NTV Telugu

Foot Fetish: స్త్రీ పురుషుల మధ్య ప్రేమను పెంచే పాదాలు

Foots Health

Foots Health

ఆరోగ్యకరమైన అలవాట్లు లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి అంటున్నారు వైద్యులు. లైంగిక శ్రేయస్సుపై ఆ వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీ లైంగిక పనితీరును మెరుగుపరిచే ఆరోగ్యకరమైన అలవాట్లను పెంచుకోవాలి. అయితే అవకాశం ఉన్నప్పుడు, వీలున్నప్పుడల్లా పురుషులు తన భాగస్వామి గురించి ఆలోచిస్తుంటారు. పురుషులు రోడ్డుపై నడుస్తుంటే అందమయిన స్త్రీ వారి ముందుగా వెళితే కాసేపు డిస్ట్రబ్ అవుతారు. ఆమె వంక ఓసారి తేరిపారజూసి, మళ్లీ వాళ్ళ పని వారు చేసుకుంటారు ! ఇది సహజం. ఇందుకు ఆమె అందంగానే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో సెక్స్ కోరిక లేకపోవచ్చుగానీ ఇది ప్రకృతిపరంగా పురుషుల సహజ లక్షణం.

పురుషుల్లో స్త్రీల పట్ల ఆసక్తి, స్త్రీ గురించి ఆలోచించడం జీవపరిణామ క్రియలో భాగం. దృశ్యం, శబ్దం, స్పర్శ, వాసనల వంటి ఇతర ఇంద్రియాలకు సంబంధించిన సమాచారం అందిన తర్వాతే. శృంగార భావనలు ప్రేరేపించబడతాయి. పురుషులకు ఇలాంటివి గ్రహించే గుణం సహజంగానే ఎక్కువ. కాబట్టి స్త్రీ సంబంధ సంకేతాలకు త్వరగా ఆకర్షితులవుతారు. ప్రకృతి సహజమైన ఈ ఏర్పాటు వెనకున్న లక్ష్యం సంతానాభివృద్ధితో పాటు జాతి మనుగడలే అంటారు సెక్సాలజిస్టులు. నిజానికి జీవిత భాగస్వామి మీద ప్రేమ తగ్గిపోతే అది వివాహేతర సంబంధాలకు కారణం అవుతుంది. దీంతో కుటుంబాలు వీధిన పడతాయి. జరగరాని ఘోరాలు జరిగిపోతాయి.

అందుకే అల వైకుంఠపురం సినిమాలో కవి పాదాల గురించి ప్రత్యేకంగా పాట రాసిపారేశాడు. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు.. అంటూ రాసిన పాట బంపర్ హిట్ అయింది.

ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు

నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు

నీ కళ్ళకు కావాలి కాస్త ఏ కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు

నాఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటె ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా..

సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా.. అంటూ సిరివెన్నెల పాదాల అందాల గురించి కవిత్వం రాసేశారు.

Read Also: Mohammed Shami: కోహ్లీని దాటేసిన షమీ..స్టార్ బ్యాటర్లనూ వెనక్కునెట్టి

పురుషులు మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్త్రీలు కూడా తమ అవయవాల ద్వారా పురుషుడిని ప్రేరేపిస్తారు. ముఖ్యంగా పెదవులు, నడుము, మెడవంపు, బొడ్డు, పాదాలు కూడా కామ వాంఛలను పెంచే ప్రాంతాలు. వీటిని ప్రేరేపించడం ద్వారా పురుషుల్లో కోరికలు పెరుగుతాయి. స్త్రీలు కూడా తాపలేకపోతారు. అప్పుడే పురుషుడు ఆమె నరనరాల్లో ఉత్తేజం తీసుకురాగలడు. స్త్రీ, పురుషుల సంబంధాల్లో శరీరంపై సువాసనలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఒక స్త్రీ పురుషుడిని ఆకర్షించాలంటే, ఆమె తన కురులను సవరిస్తూ వెళ్తుంది. తన వెనక ఒక ప్రత్యేకమైన సుగంధాన్ని వదులుతుంది. మీరు రోజూ ఏది చేసినా, చేయకున్నా.. ఒక్క పని చేయండి. మీ పార్ట్‌నర్‌కు రోజులో ఒక్కసారైనా కనీసం పది సెకన్ల పాటు వదలకుండా ఒక్క ముద్దు పెట్టండి. అది ఆమె పెదాలు, మెడవంపు, నుదుటిపైనే కాదు… ఆమె పాదాలను సున్నితంగా స్పృశించడం అవసరం.

స్త్రీ, పురుషుల శారీరక సంబంధాల్లో పాదాలు కూడా చాలా కీలక పాత్ర ఉంటుంది. ఇది చాలా తక్కువమందికి తెలుసు. ఆకర్షించే కళలో పాదాలు చాలా ప్రత్యేకం అని ఎంతమందికి తెలుసు. అందుకే మహిళలు ముఖం కంటే ఎక్కువగా తమ పాదాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. మన శరీరంలోని నరాలు అన్నీ పాదాల్లోకి వెళ్లి ముగుస్తాయి. శరీరంలోని చాలా సున్నితమైన అంగాలు కూడా పాదాలే. ఈమధ్య మనం మన పాదాలను హైహీల్స్‌లో ఇరికించేస్తున్నాం. మీరు ఎవర్నైనా మీ పాదాలతో ఆకర్షించాలంటే కూర్చుని, మీ చెప్పులు తీయండి, పాదాలను అటూ ఇటూ తిప్పండి. వాటిని అందరికీ చూపించండి. శరీరంలోని అందమైన భాగాల్లో మన పాదాలూ ఉన్నాయంటారు మానసిక వైద్యులు. మీకు దగ్గర్లో లాన్ ఉంటే పాదాలకు ఉన్న చెప్పులు దూరంగా విడిచేసి దానిపై నడవండి. మీ బెడ్ రూంలో, మీ హాల్ లో పాదరక్షలు లేకుండా నడవండి. చాలా మంది ముఖానికి చాలా మేకప్ వేసుకుంటారు. చేతులకు మెనిక్యూర్ చేయించుకుంటారు. కానీ పాదాలను మాత్రం పట్టించుకోరు. మడమలు పగిలిపోయినా చూసుకోరు. పాదాలను ఎప్పుడూ అందంగా ఉంచుకోడానికి ప్రయత్నించడం ఎంతో అవసరం. ఎందుకంటే మీ శరీరంలోని సెక్సీ అవయవాలు అంటున్నారు వైద్యులు.

చర్మాన్ని మృదువుగా చేయడానికి మరియు మృత చర్మ కణాలను తొలగించడానికి ఎప్సమ్ సాల్ట్‌తో మీ పాదాలను బకెట్ గానీ ఏదైనా పాత్రలో కాసేపు నానబెట్టండి. నెయిల్ క్లిప్పర్‌తో మీ గోళ్ళను కత్తిరించండి, ఆపై మీ గోళ్లను ఆకృతి చేయడానికి నెయిల్ ఫైల్‌ని ఉపయోగించండి. మీ గోళ్ళపై కనీసం 2 కోట్ల నెయిల్ పాలిష్‌తో పెయింట్ చేయండి. పిప్పరమింట్, నిమ్మకాయ లేదా టీ ట్రీ నూనెలు వాడవచ్చు. మీకు ఎప్సమ్ ఉప్పు లేకపోతే మాయిశ్చరైజింగ్ సబ్బు మీ పాదాలను మృదువుగా మరియు శుభ్రపరచగలదు.ఫుట్ బాత్ లేదా పెద్ద బేసిన్ లేదా? మీ బాత్‌టబ్‌ను మీ పాదాలను కప్పి ఉంచేంత నీటితో నింపండి. తరచూ ఇలా చేయడం వల్ల మీ పాదాల్లో డెడ్ స్కీన్ పోతుంది. మీ పాదాలు సెక్సీగా మారతాయి.

Read Also: NTR: యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త?

<p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>

Exit mobile version