నిమ్మ-పెరుగు: ఒక గిన్నెలో కాస్త నిమ్మరసం, పెరుగు మిక్స్ చేసి.. పేస్టులా ముఖానికి బాగా అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ను, మురికి తొలగించి.. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

పాలు-తేనె: ఒక గిన్నెలో కొద్దిగా పాలు, తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ బట్‌తో చర్మంపై అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్ డ్రై స్కిన్‌ని, మచ్చలని, మొటిమలను నివారిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పులో నీళ్లు, అందులో ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి.. కాటన్ వస్త్రంతో చర్మంపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇది చర్మ రంధ్రాలను, మొటిమలని తగ్గించి.. మలినాల్ని తొలగిస్తుంది.

ముల్తానీ మిట్టి-రోజ్ వాటర్: ఒక గిన్నెలో ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ పేస్టులా కలిపి.. ముఖం, మెడపై రాసి మసాజ్ చేయాలి. కాసేపయ్యాక గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది ముఖంలో జిడ్డు, మొటిమలను నివారిస్తుంది.

టమోటా-పెరుగు: ఒక గిన్నెలో టొమాటో పేస్ట్, పెరుగు మిక్స్ చేసి.. ఆ పేస్ట్‌ని ముఖానికి రాయాలి. 5 నిమిషాలపాటు మసాజ్ చేసి, ఆ తర్వాత కడిగేయాలి. ఇది స్కిన్ పిగ్మెంటేషన్, మచ్చలను తేలికపరచడానికి.. దోహదపడుతుంది.

లబంద-తేనె: ఒక కప్పులో అలొవెరా జెల్, తేనె మిక్స్ చేసి.. మెత్తని పేస్టులో తయారుచేయాలి. ఈ పేస్టుని ముఖంపై అప్లై చేసి, కాసేపయ్యాక శుభ్రంగా కడగాలి. ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.

సముద్రపు పాచి-పసుపు-చందనం: కొంచెం సముద్రపు పాచి, పసుపు, చందనం, రోజ్ వాటర్ అవసరం కలిపి.. పేస్టులా తయారుచేసి, ముఖానికి పట్టించాలి. కాసేపయ్యాక కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మ వ్యాధులను నివారించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.