Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arthritis Pain in Monsoon: వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి మాత్రం ఇది కీళ్ల నొప్పిని మరింత పెంచే కాలంగా మారుతుంది. ముఖ్యంగా మోకాళ్లు, భుజాలు, తుంటి భాగాల్లో నొప్పి, బిగుతు, అసౌకర్యం ఎక్కువగా అనిపిస్తుంటాయి. అయితే ఈ సమస్యను నాలుగు నెలలు భరించాల్సిందే అనే అవసరం లేదని ఆర్థోపెడిక్ నిపుణులు చెబుతున్నారు. కారణాలను అర్థం చేసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నొప్పిని గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
వర్షాకాలంలో తేమ పెరగడం, వాతావరణ పీడనం (బారోమెట్రిక్ ప్రెషర్) తగ్గడం కీళ్ల నొప్పి పెరగడానికి ప్రధాన కారణాలు. వాతావరణ పీడనం తగ్గినప్పుడు కీళ్ల చుట్టూ ఉన్న కణజాలం స్వల్పంగా విస్తరించి, సున్నితమైన నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల నొప్పి, బిగుతు ఎక్కువగా అనిపించవచ్చు. అలాగే చల్లటి, తడి వాతావరణం వల్ల కండరాలు, లిగమెంట్లు బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. వర్షాల కారణంగా శారీరక శ్రమ తగ్గిపోవడం కూడా కీళ్ల బిగుతును మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పాత క్రీడా గాయాలు లేదా దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Also Read
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
- Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
వర్షాకాలంలో కీళ్ల నొప్పి తగ్గించేందుకు 5 చిట్కాలు
1. శారీరక శ్రమ ఆపొద్దు: వర్షాల కారణంగా ఇంట్లోనే ఉండాల్సి వచ్చినా, తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచింగ్‌ను కొనసాగించాలి. దీంతో కీళ్లు చురుకుగా ఉండి బిగుతు తగ్గుతుంది.
2. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవద్దు: తేమ ఎక్కువగా ఉన్న రోజుల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల కీళ్లు మరింత బిగుసుకుపోతాయి. ప్రతి 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవడం మంచిది.
3. సమతుల ఆహారం తీసుకుని బరువును నియంత్రించండి: కాల్షియం, విటమిన్-డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అధిక బరువు మోకాళ్లు, తుంటి కీళ్లపై అదనపు ఒత్తిడిని పెంచి నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది.
4. తగినంత నీరు తాగండి: వర్షాకాలంలో దాహం తక్కువగా అనిపించినా, శరీరానికి అవసరమైనంత నీరు తాగడం తప్పనిసరి. ఇది శరీర ఆరోగ్యంతో పాటు కీళ్ల పనితీరుకు కూడా మేలు చేస్తుంది.
5. వైద్యుల సూచించిన మందులు, ఫిజియోథెరపీని కొనసాగించండి: నొప్పి పెరిగిందని మందులను మధ్యలో ఆపేయకూడదు. వైద్యులు సూచించిన మందులు, ఫిజియోథెరపీ వ్యాయామాలను క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల కీళ్ల సమస్యలను నియంత్రించవచ్చు.
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!