NTV Telugu Site icon

Heart Health: జిమ్‌కి వెళ్లాలనుకుంటున్నారా..? ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిది..

Heart Attack Gym

Heart Attack Gym

Exercise – heart health: ఆరోగ్యం కోసం జిమ్ కు వెళ్తే గుండె పోటుతో మరణించిన సంఘటనలు ఇటీవల కాలంలో చాలానే చూశాం. యువకులు, వయసు పైబడిన వారు అనే తేడా లేకుండా వ్యాయామాలు చేస్తూ గుండెపోటుకు గురవుతున్నారు. ఫిట్ నెస్ కోసం జిమ్ చేస్తూనే కుప్పకూలిపోతున్నారు. కన్నడ స్టార్ పునిత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే జిమ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్ కు గురై మరణించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే జిమ్ కు వెళ్లాలనుకుంటున్న వారు గుండె పరీక్షలు చేయించుకుంటే మంచిదని గుండె వ్యాధి నిపుణులు అయిన డాక్టర్లు సూచిస్తున్నారు. ఎప్పుడూ వ్యాయామం చేయని వారికి, సాధారణంగా తేలికపాటి వ్యాయామం చేసేవారికి హార్ట్ స్క్రీనింగ్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నడక, వేగంగా నడవడం, స్మిమ్మింగ్ వంటి వ్యాయామాలకు గుండె పరీక్షలు చేయించుకునే అవసరం లేదు.

Read Also: Ranji Trophy: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 42 ఏళ్ల తర్వాత ముంబైపై ఢిల్లీ విజయం

సాాధారణంగా వ్యాయామం చేసే సమయంలో ధమనుల్లో కాల్సిఫైడ్ ఫలకాలు ఏర్పడుతాయి. ఇవి ఇలా పెరుగుతూ గుండె ధమనులను సన్నగా మారుస్తుంది. శారీరక శ్రమ గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది దీంతో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కుటుంబంలో గుండెపొటు, గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉంటే, మీరు జిమ్ లో చేరకపోయినా హార్ట్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 30-35 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తి కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధులు చరిత్ర ఉంటే హార్ట్ స్కాన్ చేయించుకోవడం మంచిది.

జిమ్ లో అధిక, తీవ్రమైన వ్యాయామాలు, భారీ బరువులను ఎత్తాలనుకుంటే ముందుగా ఈసీజీ, ఎకో, టీఎంటీ(ట్రెడ్మిల్ టెస్ట్)తో సహా మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలు మన గుండె ఫిట్ నెస్ ను నిర్థారిస్తాయి. సాధారణంగా జిమ్ లో చేరాలనే ప్లాన్ లేకపోయినా.. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు చేయించుకుంటే మంచిది. హై ఇంటెన్సీటీ వ్యాయామాలు చేసే ముందు కరోనరీ కాల్షియం స్కాన్, గుండె స్కాన్ చేయించుకోవాలి. ఇది ధమనుల్లో కాల్షియం ఫలకాలను కొలవడానికి సహయపడుతుంది. ఇది గుండె జబ్బుల సమాచారాన్ని ముందుగానే చెప్తుంది.