సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలను అవాక్కయ్యేలా చేస్తున్నాయి.. ఇక ఉద్యోగాలతో కుటుంబాన్ని పోషించుకోలేని వారంతా కూడా చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు.. కొన్నిసార్లు వారి టాలెంట్ ను బయట పెడుతూ జనాలను తెగ ఆకట్టుకుంటున్నారు.. తాజాగా మోమోస్ అమ్ముతున్న వ్యక్తి అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడుతూ అందరిని షాక్ అయ్యేలా చేశాడు..
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఓ ఆసక్తిక దృశ్యం కనిపించింది. లక్నోలోని రహదారికి ఒకవైపు ఒక మధ్యవయసు వ్యక్తి వేడివేడిగా మోమోస్అమ్ముతూ కనిపించాడు. ‘ఈ మోమోస్ ఇంటిదగ్గర చాలా నీట్ గా తయారుచేసిన మోమోస్’ అని ఇంగ్లీషులో అనర్గళంగా పబ్లిసిటీ చేసుకుంటూ అతను కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు… అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ వీడియోలో వైరల్ అవుతుంది..
ఓ యువకుడు అతని దగ్గరకు మోమోస్ తీసుకున్నాడు.. మీరు ఇంగ్లిష్ ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు.. తాను ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసానని చెప్పడంతో అతడు షాక్ అయ్యాడు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. తరగతిలో టాపర్స్ అంటుంటాం కానీ చాలావరకు టాపర్స్ పరిస్థితి ఇలానే తయారవుతుంది అని ఒకరు కామెంట్ చేశారు. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు’ అని మరొకరు అన్నారు. మోమోస్ చాలా బాగా తయారుచేశారు. పైపొర చాలా పలుచగా ఉంది’ అని ఒకరు మోమోస్ క్వాలిటీని మెచ్చుకున్నారు.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..