Weight Loss: సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిని తగ్గించుకోవడానికి మళ్లీ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పటికే కష్టపడి సంపాదించిన సొమ్మును అనారోగ్యానికి వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మనం రోజూ తినే ఆహారంలో అయినా, తినే సమయానికైనా సరైన పద్ధతిని పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం. తినే ఆహారమే కాదు కాస్త మనమీద మనం శ్రద్ద వహిస్తే చాలు.. దానికి తోడుగా కొన్ని పదార్థాలు నానబెట్టి తింటే సరే. అధిక బరువు చాలా మందికి సమస్యగా వున్న వారికి ఇదికూడా ఒక చిట్కాలా పనిచేస్తుంది. మీరు బరువు తగ్గడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మాత్రం ఈటిప్ పాటిస్తే చాలు.. ఫలితం ఉంటుంది. కొన్ని పదార్థాలను నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలుంటాయి. అవేంటీ… ఏ పదార్థాలు ఎలా తీసుకోవచ్చో చూద్దామా….
నానబెట్టిన మెంతులు: రెండు చెంచాల మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీటినీ తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రప రిచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. నెలసరి సమ యంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.
నానబెట్టిన అవిసె గింజలు: వీటిలో పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-బి, ఇనుము, మాంసకృత్తులు, ఒమేగా 13 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ చెంచా నానబె ట్టిన గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.
నానబెట్టిన అంజీరా… ఇది పోషకాల గని, దీంట్లో ఎ, బి విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, సోడియం, పొటాషియం, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ పోరాడి అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తాయి. మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. అధిక రక్తపోటును తగ్గిస్తాయి. • బాదం… రోజూ నానబెట్టిన అయిదారు పాదంపప్పులను తింటే మెదడు చురుకుగా ఉంటుంది. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గడంతోపాటు బరువూ నియంత్రణలో ఉంటుంది.
నానబెట్టిన ఎండుద్రాక్ష: వీటిలో ఇనుము, యాంటీ ఆక్సి డెంట్లు మెండుగా ఉంటాయి. కిస్మిస్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా మార డంతోపాటు కాంతులీనుతుంది. రోజూ రాత్రిపూట పది, పన్నెండు ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇనుము సమృద్ధిగా అందుతుంది.
Extra Marital Affair: ఇల్లాలిని పుట్టింట్లో వదిలి.. ప్రియురాలితో అచ్చట ముచ్చట.. తర్వాత ఏం జరిగిందంటే?