NTV Telugu Site icon

Thyroid Diseases: థైరాయిడ్ కు మునగాకుతో చెక్..

Munagaku

Munagaku

Thyroid Diseases: ప్రస్తుత కాలంలో ఆధునిక జీవన శైలి, ఒత్తడి, ఆహారపు అలవాట్లు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మన శరీరాన్ని కాపాడాల్నిన వ్యవస్థలే మన శరీరంపై దాడులు చేస్తున్నాయి. వీటికి కొన్ని ఉదాహరణలుగా షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను చెప్పవచ్చు. ప్రస్తుతం ఇలా వస్తున్న ఇలాంటి వ్యాధుల్లో థైరాయిడ్ ఒకటి. మన గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంధి మన శరీరంలోని అనేక వ్యవస్థలను సమన్వయం చేస్తుంది. ఈ గ్రంథి పనితీరులో వచ్చే మార్పుల వల్ల థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో కామన్ గా వచ్చేది ‘హైపో థైరాయిడ్’. ఈ వ్యాధి వస్తే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు, డాక్టర్లు ఇచ్చే మెడిసిన్స్ తప్పకవాడాల్సి ఉంటుంది.

ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాల్సిందే..

థైరాయిడ్ వచ్చిన వారిలో సహజంగా కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. నీరసం, అలసట, మానసికంగా కుంగిపోవడం, బరువు పెరగడం, చల్లదనం భరించలేకపోవడం, అతినిద్ర, చర్మ పొడిబారడం, జట్టు రాలిపోవడం, కండరాల నొప్పులు, ఏకాగ్రత లోపించడం వంటివి హైపోథైరాయిడ్ లక్షణాలు. ఇది ఆటో ఇమ్యూన్ సమస్య. అయోడిన్ లోపం, ఒత్తడి, జీవన విధానంలో లోపాలు వీటికి కారణాలుగా ఉంటాయి. కొన్ని సార్లు ఇవే కారణాలు అని కూడా చెప్పలేము. ఇలాంటి సమయంలో థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేసే ఆహార అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా క్యాబేజీ, క్యాలి ఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్, బేరికాయ, స్ట్రాబెర్రీస్ ను తినడం తగ్గించాలి. యోగసనాల్లో మత్స్య, భుజంగ, జిహాముద్ర అలాగే ఉజ్జయీ ప్రాణయామం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

మునగాకుతో థైరాయిడ్ కు చెక్..

థైరాయిడ్ సమస్య ఉన్న వారు మునగాకుతో ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. చిన్న చిన్న ఇంటి చిట్కాల ద్వారా థైరాయిడ్ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. మునగాకు పప్పు లేదా పచ్చడిని రోజూ తీసుకోవాలి. మునగాకుల్ని కషాయంగా చేసుకుని రెగ్యులర్ గా తీసుకోవాలి. తరచూ మునగాకును ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాని ప్రయోజనాలను మన శరీరానికి అందించినవారం అవుతాం.

శొంఠి కొమ్ములను నేతిలో వేయించి చల్లారిన తర్వాత చూర్ణంగా చేసుకుని, అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో అరచెంచా శొంఠిపొడి నెయ్యి కలిపి తినాలి. లేకపోతే శొంఠి పొడితో కషాయం కాచుకోవాలి. 30 ఎంఎల్ పరిమాణంలో రోజూ తీసుకోవచ్చు.

Read Also:సెనగపిండి ఎక్కువగా వాడుతున్నారా? అయితే, డయాబెటిస్ నుంచి మీకు రక్షణ లభిస్తున్నట్టే!