NTV Telugu Site icon

Liver Disease : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ పని అయిపోయినట్లే?

Liver

Liver

మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలతో పాటు లివర్ కూడా చాలా ముఖ్యమైన అంగం. లివర్ పనితీరులో ఏమాత్రం తేడా జరిగినా అది కాస్తా ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే.. మీ లివర్ ప్రమాదంలో ఉందని కొన్ని లక్షణాలు హెచ్చరిస్తాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం…

మూత్రం రంగులో మార్పు..
మూత్రం రంగులో మార్పు వచ్చినా.. కిడ్నీ, లివర్‌లో సమస్యలున్నట్లు భావించాలి. ముఖ్యంగా శరీరంలోని మలినాలను తొలగించే కాలేయం సరిగా పనిచేయకపోతే పిత్త రసం, లవణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో పేరుకుపోయి, చివరికి మూత్రవిసర్జన, మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. మీ నీళ్లు సరిగ్గా తాగకపోయినా మూత్రం ముదురు రంగులో ఉంటుంది. ఒకవేళ మీరు సరిపడా నీళ్లు తాగినా.. మీ మూత్రం ముదుర రంగులో ఉంటే లివర్‌ సమస్యలో ఉన్నట్లు అనుమానించాల్సిందే.

నోట్లో దుర్వాసన..
నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్కోసారి కాలేయంలో సమస్యలు వచ్చినా నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. మీరు నోటి శుభ్రత పాటించినా.. దుర్వాసన సమస్య ఉంటే డాక్టర్‌ను కలవడం మంచిది.

కళ్లు పసుపు రంగులోకి మారడం..
కొన్ని వ్యాధుల లక్షణాలు కళ్ల ద్వారానే గుర్తిస్తారు! దీనికి మంచి ఉదాహరణ కామెర్లు, హెపటైటిస్. ఈ సమస్యలు ఉంటే.. కళ్లు పసుపు పచ్చగా మారతాయి. ఒకవేళ.. మీరు నిద్ర లేవగానే కళ్ల రంగు పసుపు రంగులోకి మారితే.. లివర్‌ ప్రాబ్లమ్‌ ఉన్నట్లు అనుమానించాల్సిందే. మీరు వెంటనే‌ డాక్టర్‌ను కలవడం మేలు.

కడుపు నొప్పి…
సాధారణంగా, కడుపులో అసౌకర్యం ఉంటే వికారంగా, వాంతి వచ్చేలా ఉంటుంది. కొన్ని సార్లు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. చాలా మంది ఇది కడుపులో అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ, ఈ సమస్య పదేపదే ఇబ్బంది పెడుతుంటే.. మీ లివర్‌లో సమస్య ఉందని అనుమానించాల్సిందే. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. అలాగే హఠాత్తుగా చేతులు, కాళ్లు వాపు వస్తే కూడావ లివర్‌ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించాలి. ఈ సమస్యలు మీకు తలెత్తితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.