NTV Telugu Site icon

Smoking: స్మోకింగ్ హానికరమైనదే.. కానీ దాని వల్ల ఇంకో సమస్య కూడా ఉంది..

Smoking

Smoking

Smoking: ఏ షాప్ దగ్గర చూసినా స్మోకింగ్.. ఫ్రెండ్స్ గుంపులుగా ఉన్నా స్మోకింగ్. పార్టీ చేసుకున్న స్మోకింగ్. పని ఒత్తిడి ఎక్కువైనా స్మోకింగ్. బాధ వచ్చినా.. సంతోషమచ్చినా స్మోకింగ్ వ్యసనంగా మారిపోయింది. ఈ రోజుల్లో స్మోకింగ్ చేసేవారి కంటే స్మోకింగ్ చేయని వారి సంఖ్య తక్కువగా ఉంది. అలా మారిపోయారు. అయితే అప్పటి ఆనందానికి చూసుకుంటే స్మోకింగ్ అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిసినా.. పీల్చుతూనే ఉంటారు. చివరకు సిగరెట్ బాక్స్ పైనా కూడా స్మోక్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చినా.. అబ్బే మేమెందుకు ఊరుకుంటాం. పీల్చాల్సిందే అంటున్నారు జనాలు.

Read Also: Mamata Banerjee: ఈ శతాబ్దంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే..!

స్మోకింగ్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీసే వందలాది రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఇంది అందరికీ తెలిసిన విషయమే.. కానీ తక్కువ మందికే తెలిసిందేంటంటే.. స్మోకింగ్ తో చర్మ సమస్యలు వస్తాయని. స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ధూమపానం శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులను మాత్రమే కాదు మన చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది. పొగాకు పొగలో నికోటిన్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది. దీనివల్ల చర్మ కణాలు, శ్వాసనాళ కణాలు, మానవ శరీరంలోని ఇతర అవయవాలకు విషపూరితంగా మారుతాయి. పొగను శరీరం చర్మం, శ్వాసనాళం, పేగు శ్లేష్మంలోకి నికోటిన్ ను గ్రహించి.. చర్మాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ముఖ్యమైన రోగనిరోధక విధులకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా నికోటిన్ ఈ కణాలలో అపోప్టోసిస్-కణాలు చనిపోవడానికి దారితీస్తుంది. చర్మంలోని రక్త నాళాలను దెబ్బతీస్తుంది. రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది.

Read Also: Tamannah Bhatia: ఛీఛీ.. తమన్నా.. మొత్తం కనిపించేస్తుంది.. ఇలా తయారయ్యావేంటి పాప

స్మోకింగ్ చేయడం వల్ల చర్మం బొద్దుగా, దృఢంగా అవుతుంది. స్మోకింగ్ చేసే వారికి ముడతలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు స్మోకింగ్ చర్మాన్ని జిడ్డుగా మార్చే స్కిన్ కొల్లాజెన్ విచ్ఛిన్నం కావడానికి కూడా దారితీస్తుందని అంటున్నారు. చర్మంలో మెలనోసైట్లు పెరగడం వల్ల చర్మం పిగ్మెంటేషన్ ను కారణమయ్యే మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కువ కాలం ఉంటే ఇది వయస్సు మచ్చలు, నల్ల మచ్చలుగా అభివృద్ధి చెందుతుంది. సిగరెట్ పొగలోని రసాయనాలు ట్రాన్స్ ఎపిడెర్మల్ నీటి నష్టం, కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్ క్షీణతను పెంచుతాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే చర్మం పొడిబారేలా చేస్తుంది. ధూమపానం చేసేవారి చర్మానికి రక్తం సరఫరా తగ్గుతుంది.