Site icon NTV Telugu

Skin Care Tips: చలికాలంలో మీ చర్మం పొడిబారుతుందా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Charmam

Charmam

Skin Care Tips: చలికాలం వచ్చిందంటే మన చర్మం మొత్తం పొడిబారడం, దురద, పొలుసులు రావడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల చర్మంలో తేమ శాతం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని సూచనలను పాటిస్తే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అయితే, శీతాకాలంలో చాలా మంది వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేస్తుటారు. కానీ, 5-10 నిమిషాలలో స్నానం చేయడం మంచిది అంటున్నారు. ఎక్కువ సేపు వేడి నీటితో స్నానం చేయడం వలన చర్మంలోని సహజ తేమను తగ్గించి మరింతగా పొడిబారడానికి కారణమవుతుందని అంటున్నారు.

Read Also: Navi UPI: క్యూఆర్ కోడ్ టికెట్ కొనుగోలు వ్యవస్థను ప్రారంభించనున్న మెట్రో

లోషన్స్‌కు బదులుగా క్రీములు
సాధారణంగా లోషన్లలో కెమికల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల వాటిని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. సువాసనలేని, రసాయనాలు లేని క్రీములను వాడాలని సూచిస్తున్నారు. స్నానం చేసిన వెంటనే చర్మం తడిగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేయడం మంచిదని అంటున్నారు. అలాగే, పొడి చర్మం ఉన్నవారికి ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, బాదం నూనె లాంటివి చాలా మంచివి.. ముఖ్యంగా చర్మంపై నెమ్మదిగా మసాజ్ చేస్తే తేమ నిల్వ అనేది ఉంటుంది.

Read Also: Dangerous Stunts: రైల్వే ట్రాక్‌ పై ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడు.. వీడియో వైరల్..

ఎక్స్‌ఫోలియేషన్‌ని తగ్గించండి
ఎక్స్‌ఫోలియేట్‌ చేయడం చర్మంలోని మృతకణాలను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. కానీ శీతాకాలంలో వారానికి ఒకసారి లేదా గరిష్టంగా రెండుసార్లు మాత్రమే చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సార్లు ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తే చర్మం మరింతగా పొడిబారుతుంది అని హెచ్చరిస్తున్నారు. అలాగే, చల్లని గాలుల వలన చర్మం మరింతగా డీహైడ్రేట్‌ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇళ్ల నుంచి బయటకు వెళ్లే సమయంలో చేతులకు గ్లౌజ్‌లు, పెదవులకు లిప్‌బామ్, ముఖానికి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలని తెలియజేస్తున్నారు. ఇక, ఇంటి లోపల గాలి పొడిగా మారకుండా హ్యూమిడిఫైయర్ వాడితే ఉత్తమం. అలాగే, లాండ్రీ డిటర్జెంట్‌ సువాసనలేని, రసాయనాల లేని దాన్ని ఉపయోగించాలని వైద్య నిపుణులు వెల్లడించారు.

Note:

నోట్ : ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం.. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version