Alcohol: ఆల్కాహాల్ తాగే ముందు ఫుడ్ తినాలా..? తాగిన తర్వాత తినాలా..? ఏది బెటర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alcohol: ప్రస్తుత కాలంలో ఆల్కాహాల్ తీసుకోవడం చాలా కామన్ గా మారింది. సోషల్ గ్యాదరింగ్స్, పార్టీల్లో తప్పకుండా ఆల్కాహాల్ ఉంటుంది. అయితే చాలా మందికి ఇప్పటికీ ఓ సందేహం మదిలో మెదులుతూనే ఉంది. మందు తాగే ముందు ఫుడ్ తినాలా..? లేక పోతే మందు తాగిన తర్వాత ఫుడ్ తినాలా.? అనే సందేహం ఉంటోంది. అయితే ఇందులో ఏది బెటర్ అనేది నిపుణులు చెబుతున్నారు.
తినకుండా ఆల్కాహాల్ తీసుకుంటే ఏం అవుతుంది..?
ఆల్కాహాల్ తీసుకున్న తర్వాత ఇది మన పొట్టలోకి వెళ్తుంది. మందు తాగే ముందు మనం ఏదైనా ఆహారం తీసుకుంటే మన జీర్ణాశయం ఆహారాన్ని అరిగించే పనిలో ఉంటుంది. దీంతో ఆల్కాహాల్ కడుపులోనే చాలా సేపు ఉంటుంది. చిన్న పేగులతో పోలిస్తే జీర్ణాశయం తక్కువగా ఆల్కాహాల్ ను శోషించుకుంటుంది.
Also Read
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
అయితే మనం ఏం తినకుండా ఆల్కాహాల్ తాగితే జీర్ణాశయం నుంచి నేరుగా చిన్న పేగుల్లోకి చేరుతుంది. దీంతో ఆల్కాహల్ ను మన శరీరం వేగంగా రక్తంలోకి తీసుకుంటుంది. మన రక్తంలోకి చేరిన ఆల్కాహాల్ గుండె, మెదడుకు చేరి మత్తును కలిగిస్తుంది. ఒక వేళ ఏం తినకుండా ఆల్కాహాల్ సేవిస్తే మత్తు వేగంగా ఎక్కుతుంది.
తిన్న తర్వాత ఆల్కాహాల్ తీసుకుంటే..
మద్యం తాగడానికి ముందు ఆల్కాహాల్ తీసుకుంటే, ఆహారం అనేది రక్షించే గోడగా నిలుస్తుంది. ఆల్కాహాల్ ని మన శరీరం శోషించుకునే రేటు తగ్గుతుంది. మన రక్తంలోకి మద్యం చేరే ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీంతో తక్కువ మత్తును ఎక్కువ సేపు కలిగి ఉంటారు.
ఏది బెటర్..?
అయితే ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్సుడ్ గా మద్యాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా ఖాళీ కడుపుతో కాకుండా.. పూర్తిగా ఫుడ్ తిన్నాక కాకుండా మధ్యే మార్గంగా వ్యవహరించాలని చెబుతున్నారు. త్రాగడానికి ముందు కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లతో కూడిన తేలికపాటి భోజనం తీసుకోవాలి. మద్యపానం సమయంలో తేలికపాటి స్నాక్స్ తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే మరుసటి రోజు హ్యాంగోవర్ నివారించే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..