NTV Telugu Site icon

Alcohol: ఆల్కాహాల్ తాగే ముందు ఫుడ్ తినాలా..? తాగిన తర్వాత తినాలా..? ఏది బెటర్..?

Alcohol

Alcohol

Alcohol: ప్రస్తుత కాలంలో ఆల్కాహాల్ తీసుకోవడం చాలా కామన్ గా మారింది. సోషల్ గ్యాదరింగ్స్, పార్టీల్లో తప్పకుండా ఆల్కాహాల్ ఉంటుంది. అయితే చాలా మందికి ఇప్పటికీ ఓ సందేహం మదిలో మెదులుతూనే ఉంది. మందు తాగే ముందు ఫుడ్ తినాలా..? లేక పోతే మందు తాగిన తర్వాత ఫుడ్ తినాలా.? అనే సందేహం ఉంటోంది. అయితే ఇందులో ఏది బెటర్ అనేది నిపుణులు చెబుతున్నారు.

తినకుండా ఆల్కాహాల్ తీసుకుంటే ఏం అవుతుంది..?
ఆల్కాహాల్ తీసుకున్న తర్వాత ఇది మన పొట్టలోకి వెళ్తుంది. మందు తాగే ముందు మనం ఏదైనా ఆహారం తీసుకుంటే మన జీర్ణాశయం ఆహారాన్ని అరిగించే పనిలో ఉంటుంది. దీంతో ఆల్కాహాల్ కడుపులోనే చాలా సేపు ఉంటుంది. చిన్న పేగులతో పోలిస్తే జీర్ణాశయం తక్కువగా ఆల్కాహాల్ ను శోషించుకుంటుంది.

అయితే మనం ఏం తినకుండా ఆల్కాహాల్ తాగితే జీర్ణాశయం నుంచి నేరుగా చిన్న పేగుల్లోకి చేరుతుంది. దీంతో ఆల్కాహల్ ను మన శరీరం వేగంగా రక్తంలోకి తీసుకుంటుంది. మన రక్తంలోకి చేరిన ఆల్కాహాల్ గుండె, మెదడుకు చేరి మత్తును కలిగిస్తుంది. ఒక వేళ ఏం తినకుండా ఆల్కాహాల్ సేవిస్తే మత్తు వేగంగా ఎక్కుతుంది.

తిన్న తర్వాత ఆల్కాహాల్ తీసుకుంటే..
మద్యం తాగడానికి ముందు ఆల్కాహాల్ తీసుకుంటే, ఆహారం అనేది రక్షించే గోడగా నిలుస్తుంది. ఆల్కాహాల్ ని మన శరీరం శోషించుకునే రేటు తగ్గుతుంది. మన రక్తంలోకి మద్యం చేరే ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీంతో తక్కువ మత్తును ఎక్కువ సేపు కలిగి ఉంటారు.

ఏది బెటర్..?
అయితే ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్సుడ్ గా మద్యాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా ఖాళీ కడుపుతో కాకుండా.. పూర్తిగా ఫుడ్ తిన్నాక కాకుండా మధ్యే మార్గంగా వ్యవహరించాలని చెబుతున్నారు. త్రాగడానికి ముందు కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లతో కూడిన తేలికపాటి భోజనం తీసుకోవాలి. మద్యపానం సమయంలో తేలికపాటి స్నాక్స్ తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే మరుసటి రోజు హ్యాంగోవర్ నివారించే అవకాశం ఉంటుంది.

Show comments