Passive Smoking: భర్త సిగరేట్ తాగితే భార్యకు కూడా డేంజర్.. పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుందట.. షాకింగ్ ఫ్యాక్ట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Passive Smoking : సిగరెట్ తాగేవారికే కాదు, పక్కన నిలబడి పొగను పీల్చేవారికీ ప్రమాదమేనని వైద్యులు ఎన్నో ఏళ్లుగా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది యువతలో ఒక అపోహ బలంగా ఉంది. పార్టీల్లో, స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు మాత్రమే పొగ తాగితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదని భావిస్తున్నారు. అయితే సంతానోత్పత్తి సామర్థ్యం విషయంలో ఈ నిర్లక్ష్యం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించే పరిస్థితిని తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముంబైలోని అంధేరిలో ఉన్న నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రానికి చెందిన ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రజక్తా చౌదరి ప్రకారం, అప్పుడప్పుడు సిగరెట్ తాగడం కూడా సంతానోత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీలు, సెలవులు, వీకెండ్ పార్టీలలో మాత్రమే పొగ తాగే వారు తమను తాము అసలు ధూమపానులుగా పరిగణించరు. అయితే సిగరెట్లో ఉండే నికోటిన్‌తో పాటు ఇతర హానికర రసాయనాలు, శరీరంలోకి పదేపదే చేరడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
- Heatwave : భారత్‌లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
- Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. 'మునక్కాయ పచ్చడి' చేసేయండి ఇలా.!
- Hair Care Tips: తలకు నూనె రాస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందా? నిజం ఎంత..?
ఇక మహిళల్లో ఈ ప్రభావం మరింత ఆందోళన కలిగించేలా ఉండవచ్చు. సిగరెట్‌లోని విషపూరిత పదార్థాలు అండాశయాల పనితీరును ప్రభావితం చేసి అండాల నాణ్యతను కూడా తగ్గించగలవు. అంతేకాదు వయస్సుతో తగ్గే అండాల నిల్వను మరింత వేగంగా క్షీణింపజేసే అవకాశం కూడా ఉంది. హార్మోన్ స్థాయిల్లో మార్పులు రావడం వల్ల నెలసరి చక్రం అసమతుల్యంగా మారి, కాలక్రమేణా గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోవచ్చు.
అప్పుడప్పుడు మాత్రమే పొగ తాగే మహిళల్లో కూడా గర్భస్రావం, గర్భాశయం వెలుపల గర్భం ఏర్పడే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి సమస్యల ముప్పు ఎక్కువగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే ముందస్తు ప్రసవం, తక్కువ బరువుతో శిశువు జననం, మృత శిశువు జననం, పుట్టిన తర్వాత శిశువుకు శ్వాస సంబంధిత వంటి ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పురుషుల్లో కూడా ధూమపానం వల్ల వీర్యకణాల సంఖ్య, వాటి కదలిక సామర్థ్యం దెబ్బతినవచ్చు. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల వీర్యకణాల డీఎన్ఏ దెబ్బతిని సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. ఈ సమస్యలు ఒక్కసారిగా బయటపడకపోవడం వల్ల చాలా మంది పురుషులు ప్రమాదాన్ని గుర్తించలేకపోతారు.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం పాసివ్ స్మోకింగ్. అంటే తాము సిగరెట్ తాగకపోయినా, తరచుగా ఇతరుల పొగకు గురయ్యే వారు కూడా ప్రమాదం నుంచి తప్పించుకోలేరు. ముఖ్యంగా గర్భధారణ కోసం ప్రణాళికలు వేసుకుంటున్న దంపతులు, ఐవీఎఫ్ వంటి ఫెర్టిలిటీ చికిత్సలు తీసుకుంటున్న వాళ్ళు ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది.
ధూమపానం చాలాసార్లు మద్యం సేవించడం, రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండటం, అధిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లతో కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ కలిసి హార్మోన్ల సమతుల్యతను మరింత దెబ్బతీసి సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు.
అందుకే రోజూ పొగ తాగేవారికే కాదు, అప్పుడప్పుడు సరదాగా సిగరెట్ వెలిగించే వారికీ ఈ హెచ్చరిక వర్తిస్తుంది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవాలంటే ధూమపానాన్ని పూర్తిగా మానేయడమే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయం, రేపటి ఆరోగ్యకరమైన గర్భధారణకు, ఆరోగ్యవంతమైన కుటుంబ భవిష్యత్తుకు పునాది కావచ్చు.
తాజావార్తలు
-
Passive Smoking: భర్త సిగరేట్ తాగితే భార్యకు కూడా డేంజర్.. పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుందట.. షాకింగ్ ఫ్యాక్ట్స్!
-
Electric Scooters: ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా.. వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? పూర్తి వివరాలు
-
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా… ఐయండిబిలో 9.1 రేటింగ్… తెలుగులోనూ చూడచ్చు
-
Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
-
Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..