ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు.. ఎన్నో పోషకాలు ఉన్న ఉల్లిపాయలు రుచి పరంగా బెస్ట్.. ప్రతి వంటకు ఉల్లిపాయ ఉండాల్సిందే.. లేకుంటే కూర రుచించదు..ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని తెలుసు కానీ ఉల్లిపాయ తొక్కలు వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ తొక్కల ఉపయోగాల గురించి మనం ఎక్కడ విని ఉండం.. నిజానికి ఆ పొట్టు వల్ల కూడా పుట్టెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మరి ఆలస్యం ఆ ఆరోగ్య రహస్యాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సాధారణంగా మనం వంటలో ఉల్లిపాయలని వాడుకొని, వాటి తొక్కలని పడేస్తాము. ఉల్లిపాయ తొక్కలో విటమిన్ ఏ, ఈ , సి ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయ తొక్కలు చర్మ వ్యాధులకి, దురదలు, ఎలర్జీలకు వాడుతారు. ఉల్లిపాయ తొక్కల టీ రుచి బిన్నంగా ఉన్న దానిలోని పోషకాలు చర్మానికి, గుండెకి, కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది..తొక్కలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని నీటిలో మరగబెట్టి వడగట్టి తాగడం ద్వారా గుండె సంబంధిత రోగాలు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉల్లిపాయ తొక్కలో విటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతి వంతంగా మారుస్తుంది..
ఈ ఉల్లిపాయ జుట్టుకు ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఉల్లిపాయ తొక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటితో తల స్నానం చేస్తే జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా అవుతుంది. ఉల్లిపాయల తొక్కలో ఫ్లేవనాయిడ్ల, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్ ఉండటం ద్వారా ల్లెర్జిలు, ఇన్ఫెక్షన్ల మందుల తయారీలో కూడా బాగా ఉపయోగపడుతుంది.. అంతేకాదండోయ్ మనుషులకు మాత్రమే కాదు మొక్కలకు కూడా చాలా మంచిది.. దీన్ని మొక్కలకు కంపోస్ట్ ఎరువుగా కూడా వాడవచ్చు.. చీడ పీడల నుంచి కాపాడుతుంది.. ఇంకా చెప్పాలంటే మంచి దిగుబడికి దోహదం చేస్తాయి.. అందుకే ఇప్పటి నుంచి ఉల్లిపాయ తొక్కలను వేస్ట్ చెయ్యకండి.. వాటిని మీకు నచ్చినట్లు వాడుకోండి..