HIV Vaccine: ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గత కొన్ని సంవత్సరాలుగా HIV వంటి ప్రమాదకరమైన వ్యాధితో పోరాడటానికి సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం వెతుకుతున్నారు. తాజాగా వ్యాక్సిన్ కనుక్కోవడంలో ఆశ కనిపించింది. ఓ ప్రయోగాత్మక వ్యాక్సిన్‌పై పరీక్ష నిర్వహించగా.. ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చినట్లు చెబుతున్నారు. కానీ ఈ వ్యాక్సిన్ పూర్తిగా విజయవంతమవుతుందా..? అనే సందేహం మొదలైంది. ఈ కొత్త HIV వ్యాక్సిన్ మొదటి ట్రయల్ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో నిర్వహించారు. దాదాపు 108 మంది ఆరోగ్యవంతులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. వారి శరీర ప్రతిస్పందనను పరీక్షించారు. మొదటి దశ ట్రయల్స్ లో ఇంకా మెరుగుపరచాల్సిన కొన్ని సంకేతాలను కనిపించాయి. ఈ టీకా ద్వారా చాలా మందిలో చర్మ ప్రతిచర్యలు కూడా కనిపించాయి. కానీ ఇవి అంత ప్రభావవంతమైనవి శాస్త్రవేత్తలు వివరించారు. ఈ వ్యాక్సిన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే… mRNA టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తయారు చేశారు. COVID-19 వ్యాక్సిన్లను కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయడం విశేషం. కానీ.. హెచ్‌ఐవీకి దాని తరచూ దాని రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అందువల్ల, బలమైన, విభిన్నమైన రోగనిరోధక శక్తి అవసరం. ఇది bnAb యాంటీబాడీస్ అందించగలదని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Rahul Gandhi: ‘‘చనిపోయిన అరుణ్ జైట్లీ ఎలా బెదిరించారు’’.. పప్పులో కాలేసిన రాహుల్ గాంధీ..
bnAb యాంటీబాడీ అంటే ఏమిటి?
bnAb అంటే బ్రాడ్‌లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీ అని అర్థం. సరళమైన భాషలో చెప్పాలంటే.. ఏదైనా రకమైన వైరస్ (HIV వైరస్) శరీరంలోకి ప్రవేశించినప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థ దానికి వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేస్తుంది. కానీ HIV వైరస్ విషయంలో రోగనిరోధక వ్యవస్థ సాధారణ యాంటీబాడీలను గుర్తించలేకపోతుంది. ఈ వైరస్ దాని రూపాన్ని మార్చుకుంటూ శరీరంలో వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. అంటే అది ఉత్పరివర్తనాలను సృష్టిస్తుంది. bnAb ద్వారా ఈ హెచ్‌ఐవీ వైరస్ వివిధ రూపాలను గుర్తించి వాటిని అంతం చేయగల ఒక యాంటీబాడీ అని చెబుతున్నారు.
నోట్: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
