Myths about dialysis among kidney patients: ప్రస్తుతం కాలంలో ఒత్తడి, లైఫ్ స్టైల్ కారణంగా కిడ్నీలు ప్రభావితం అవుతున్నాయి. అయితే కొన్నాళ్ల వరకు పెద్ద వయసు ఉండే వారిలో మాత్రమే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అప్పుడే డయాలసిస్ అవసరం అవుతుందని చాలా మంది అనుకునే వారు, కానీ ఇప్పుడు యుక్త వయస్సులో కూడా కిడ్నీల సమస్యలు ఎదురవుతున్నాయి. కిడ్నీల వైఫల్యం ఎదురయితే కిడ్నీ మార్పిడి, డయాలసిస్ విధానమే మార్గం అయితే చాలా మందిలో డయాలసిస్ అంటే చాలా భయాలు నెలకొని ఉంటాయి. లేనిపోని అపోహలకు గురి అవుతుంటారు. అయితే డయాలసిస్ లో అపోహలు, వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీసే మొదటి 10 కారణాల్లో దీర్ఘకాలిక మూత్రపిండా వ్యాధి ఒకటి. ఏడాదికి 10,00,000 మంది రోగులు మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. దీర్ఘకాలికంగా డయాలసిస్ అవసరం అయ్యే రోగుల సంఖ్య 1.75 లక్షలుగా ఉంది. బీపీ, షుగర్, ఇతర జన్యుపరమైన కారణాలు కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణం అవుతున్నాయి. ఇది ఏ వయసులో అయినా ఎవరికైనా పురుషులు, మహిళలు, పిల్లలకు రావచ్చు. డయాలసిస్ విధానంలో కిడ్నీలు చేసే పనిని ఓ యంత్రం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను పిల్టర్ చేయడం ద్వారా మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అయితే డయాలసిస్ వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందనే ఆపోహలు ఉన్నాయి. కానీ ఇవన్నీ నిజాలు కాదని నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు.
Read Also: Kanti Velugu: రెండో విడత కంటి వెలుగు ప్రారంభం.. ప్రారంభించిన జాతీయ నేతలు
1) డయాలసిస్ అనేది మరణశిక్ష అనేది వాస్తవం కాదు..
డయాలసిస్ అనేది మరణిశిక్ష అని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇది మూత్రపిండాలు పాడయితే మనిషి జీవించేందుకు రెండో అవకాశం లాంటిది. చాలా మంది ప్రజలు దశాబ్ధాలుగా డయాలసిస్ పై జీవిస్తున్నారు. డయాలిసిస్ అనేది సాధారణ విషయం గత 15 ఏళ్లలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న భారతీయుల సంఖ్య రెట్టింపు అయింది. ప్రస్తుతం ప్రతి వంద మందిలో 17 మంది పౌరులు ఏదో ఒక రూపంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు నివేదించారు. భారతదేశంలో డయాలసిస్ చేయించుకుంటున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం 10-15% పెరుగుతుంది. ఇందులో ప్రధానంగా పిల్లలు ఉన్నారు.
2) డయాలసిస్ ఉంటే ప్రయాణం చేయకూడదనేది అపోహ మాత్రమే..
డయాలసిస్ ఉన్నవారు ఇంటికే పరిమితం కావాలనేది చాలా మంది భయపెడుతుంటారు. ఆకస్మికంగా, ఇంటికి దూరంగా ప్రయాణం చేయడం కష్టం. అయితే ప్రయాణ స్థలంలో డయాలసిస్ సెంటర్ ను కనుక్కున్నట్లు అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు వెళ్లిన ప్రాంతంలో కూడా డయాలసిస్ చేయించుకునే అవకాశం ఉంటుంది.
3) ఆహారానికి దూరం కావాలనేది అబద్ధం
కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారు అన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలనేది ఓ అపోహా మాత్రమే. సరిగ్గా డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం అన్ని రకాల సంతులిత ఆహారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. తక్కువ ఉప్పు తీసుకోవడం, నియంత్రిత పొటాషియం, ఫాస్పరస్ ఆహారం, ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. కిడ్నీ ఫ్రెండ్లీ ఆహారాన్ని తీసుకోవాలి. దీని తగ్గట్లుగా మీ డాక్టర్, డైటీషియన్ సహాయం చేయగలరు.
4) డయాలసిస్ పై జీవితాన్ని ఎదుర్కోవడం అసాధ్యం కాదు..
డయాలసిస్ తో చాలా ఏళ్లు బతుకుతున్నవారు ఉన్నారు. ముందుగా తమ భయాలను అధిగమించాలి. డయాలసిస్ విధానం గురించి సరైన అవగాహన కలిగి ఉంటే జీవితాంతం ఎలాంటి సమస్యలు లేకుండా బతకవచ్చు. మానసిక ఆరోగ్యనిపుణులు, డాక్టర్లు ఈ విధానం గురించి మీకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలరు.
5) క్రీడలు, వ్యాయామంలో పాల్గొనొచ్చు..
డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్లు వ్యాయామం, ఆటలకు దూరంగా ఉండాలనేది అబద్ధం. వ్యాయామం మీ శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ (ఇండోర్ లేదా అవుట్), స్కీయింగ్, ఏరోబిక్ డ్యాన్స్, మజిల్స్ కు సంబంధించిన వ్యాయామాలు చేయవచ్చు. అయితే ఏదైనా వ్యాయామాలు ప్రారంభించే ముందు ముందుగా మీ డాక్టర్ని ఒకసారి సంప్రదిస్తే మంచిది. మీ శారీరక ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం మంచిది. ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం అనేది డయాలసిస్ ఒత్తిడిని సులభంగా ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. చక్కని పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయండి. ఆరోగ్యంగా ఉండటానికి మీ రక్తపోటును, రక్త స్థాయిలను పర్యవేక్షించండి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.