NTV Telugu Site icon

అడ్డుక‌ట్ట వేయాలంటే… ఆ నిబంధ‌న‌లు పాటించాల్సిందే…

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్టింది. రోజువారి పాజిటీవ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నాయి. అటు మ‌ర‌ణాల సంఖ్య‌కూడా త‌గ్గుముఖం పడుతున్నాయి.  అయితే, థ‌ర్డ్ ముప్పు పొంచి ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేస‌థ్యంలో కోవిడ్ కార్య‌ద‌ళం అధినేత‌, నీతి అయోగ్ స‌భ్యుడు  వీకే పాల్ కొన్ని కీలక వ్యాఖ్య‌లు చేశారు.

Read: ‘తూఫాన్’ ట్రైలర్ వచ్చేస్తుంది

క‌రోనా థ‌ర్డ్ వేవ్ గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌ప్ప‌కుండా టీకాలు వేయించుకొని, క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తే థ‌ర్డ్ వేవ్ ముప్పునుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని తెలిపారు.  థ‌ర్డ్ వేవ్ టీకాల సామ‌ర్ధ్యాన్ని త‌గ్గిస్తుంద‌ని శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని అన్నారు. ఇక థ‌ర్డ్ వేవ్ ఉదృతి ఎప్పుడు వ‌స్తుంది, తీవ్ర‌త ఎలా ఉంటుంది అనే విష‌యాన్ని ఇప్పుడే అంచ‌నా వేయ‌లేమ‌ని, క‌రోనా నియంత్ర‌ణ మార్గ‌ద‌ర్శకాల‌ను ప‌క్కాగా అమ‌లు చేస్తే త‌ప్ప‌నిస‌రిగా కంట్రోల్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు.