Site icon NTV Telugu

Health Tips: మకాడమియా నట్స్ తిన్నారా..? లేకుంటే బోలెడన్నీ ప్రయోజనాలు మిస్ అయినట్లే

Makadamiya

Makadamiya

కరోనా మహమ్మారి తర్వాత అందరకి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. హెల్తీ ఫుడ్ కి ప్రియారిటీ ఇస్తు్న్నారు. కూరగాయలు, ఆకుకూరలే కాకుండా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. మొలకెత్తిన గింజలను కూడా ఆహారంలో చేర్చుకుంటున్నారు. గింజల్లో పోషకాలు మెండుగా ఉండడంతో చాలా మంది బాదం, జీడిపప్పు, వాల్ నట్ వంటి వాటిని తీసుకుంటున్నారు. వీటితో పాటు మకాడమియా నట్స్ కూడా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మకాడమియా గింజలు (Macadamia Nuts) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హెల్తీ డ్రైఫ్రూట్స్‌లో ఒకటి.

Also Read:CM Chandrababu: రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోకి హాజరు

మకాడమియా నట్స్ కుంకుడు గింజను పోలి ఉంటాయి. పైన బ్రౌన్ కప్పు ఉండి.. లోపల వైట్ పదార్థం ఉంటుంది. మకాడమియా నట్స్ లో బోలెడు పోషక పదార్ధాలు ఉన్నాయి. మకాడమియా నట్స్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వీటిల్లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్ కంట్రోల్ చేస్తుంది. బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అధిక రక్త పోటు, పక్షవాతం వంటి సమస్యలు దరిచేరనీయదు. నీరసం, బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

Exit mobile version