NTV Telugu Site icon

Demand for lemons: అమ్మ దా’నిమ్మ’ ఇంత పెరిగావేంటమ్మా?

Lemon

Lemon

Demand for lemons: వేసవి కాలం మొదలయ్యింది. ఉదయం నుంచే మండే ఎండలు.. భగ భగ మండే సూరీడు. ఇక వేసవి తాపాన్ని తగ్గించేందుకు జనం రక రకాల పానీలయాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అందులో నిమ్మరసం ఒకటి. ఈ సమయంలో నిమ్మకాయల డిమాండ్‌ అమాంతంగా పెరిగిపోయింది. మండే ఎండలా నిమ్మ ధర భగభగ మండుతోంది. కొనుగోలు చేయాలంటేనే జనం వామ్మో నిమ్మకాయా ధర ఏంటి ఇంతనా అంటున్నారు. ఒక్క నిమ్మకాయ ధర రూ. 10 పెరగడం గమనార్హం. ఇకప్పుడు రూ. 20కి 6 వచ్చేవి అంటే 10 మూడు వస్తాయి. కానీ ఇప్పుడు ఒక్క నిమ్మకాయ ధర రూ.10 కావడంతో వామ్మో ఇదేంటి నిమ్మకాయ ధర 10 రూపాయలా అంటూ ఆశ్చర్యపోతున్నారు. వేసవి కాలంలో నిమ్మకాయలకు డిమాండ్‌ పెరగడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. ఇది నిమ్మకాయ లేక బంగారమా అంటున్నారు.

Read also: Bandi sanjay: టెన్త్‌ పేపర్‌ లీక్‌.. నేడు హైకోర్టులో బండి సంజయ్ రిమాండ్ రద్దుపై విచారణ

గత పదిరోజులుగా క్వింటా ధర దాదాపు రూ.2,500 పెరిగింది. ఈ నెల ప్రారంభంలో క్వింటా నిమ్మకాయల ధర రూ.4 నుంచి 6 వేల మధ్య ఉండగా, గత వారం రోజుల్లో రూ.7 నుంచి 8 వేలకు చేరడంతో వినియోగ దారులు లబోదిబో మంటున్నారు. ఇప్పుడు ఇంకాస్త ధర పెరిగింది. నిమ్మ మార్కెట్ కు ప్రసిద్ధి చెందిన ఏలూరులో క్వింటా ధర రూ.8,700 పలుకుతోంది. కనీస ధర రూ.3,500 ఉంది. ఇక ఆఫ్‌సీజన్‌లో క్వింటా రూ.1000 కూడా కొందరు ఈ-నామ్‌ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. సరుకు ధర నాణ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. వేసవి ఎండలు ముదురుతుండడంతో నిమ్మకాయల వినియోగం పెరిగింది. చిల్లర వ్యాపారులు కాయ సైజును బట్టి పెద్దవి రూ.10, చిన్నవి రూ.5 నుంచి 6 చొప్పున విక్రయిస్తున్నారు. ఏలూరు, తెనాలి, రాపూరు, దెందలూరు తదితర మార్కెట్‌ యార్డులకు నిమ్మకాయల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

ఒక్క ఏలూరు మార్కెట్‌కే రోజుకు 4వేలకు పైగా నిమ్మకాయలు దిగుమతి అవుతుండగా, తెనాలి, రాపూరు, దెందులూరు మార్కెట్‌లకు వందల సంఖ్యలో నిమ్మకాయలు వస్తున్నాయి. గత నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఈదురు గాలులకు నిమ్మతోటలు దెబ్బతినగా కొన్ని కాయలు దెబ్బతిన్నాయి. మంగు మరియు మచ్చల తెగుళ్లు కూడా ఉన్నాయి. నాణ్యమైన, పెద్ద సైజు నిమ్మకాయలకు అధిక ధరలు పలుకుతున్నాయి. సీజనల్ డిమాండ్ కారణంగా చిన్న సైజు, పసుపు పచ్చగా పండిన కాయలు సాధారణ రోజుల కంటే కొంచెం ఎక్కువ ధర పలుకుతున్నాయి. మరో రెండు నెలల పాటు నిమ్మకాయలకు గిరాకీ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల్లో నిమ్మతోటలున్నాయి. కొండ ప్రాంతాల్లో మోటార్ల కింద తోటలు సాగు చేస్తున్నారు. ఏటా దాదాపు 10 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఎండాకాలంలో ఎండు తెగులు సోకిందని, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడి తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. వేసవి దిగుబడి పడిపోవడం, నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు పెరుగుతున్నాయి.
Beer Bus: చెన్నై నుండి పుదుచ్చేరి.. బీర్ బస్ ప్రయాణం.. ఇందులో విశేషమేమిటంటే..