Demand for lemons: అమ్మ దా’నిమ్మ’ ఇంత పెరిగావేంటమ్మా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demand for lemons: వేసవి కాలం మొదలయ్యింది. ఉదయం నుంచే మండే ఎండలు.. భగ భగ మండే సూరీడు. ఇక వేసవి తాపాన్ని తగ్గించేందుకు జనం రక రకాల పానీలయాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అందులో నిమ్మరసం ఒకటి. ఈ సమయంలో నిమ్మకాయల డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. మండే ఎండలా నిమ్మ ధర భగభగ మండుతోంది. కొనుగోలు చేయాలంటేనే జనం వామ్మో నిమ్మకాయా ధర ఏంటి ఇంతనా అంటున్నారు. ఒక్క నిమ్మకాయ ధర రూ. 10 పెరగడం గమనార్హం. ఇకప్పుడు రూ. 20కి 6 వచ్చేవి అంటే 10 మూడు వస్తాయి. కానీ ఇప్పుడు ఒక్క నిమ్మకాయ ధర రూ.10 కావడంతో వామ్మో ఇదేంటి నిమ్మకాయ ధర 10 రూపాయలా అంటూ ఆశ్చర్యపోతున్నారు. వేసవి కాలంలో నిమ్మకాయలకు డిమాండ్ పెరగడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. ఇది నిమ్మకాయ లేక బంగారమా అంటున్నారు.
Read also: Bandi sanjay: టెన్త్ పేపర్ లీక్.. నేడు హైకోర్టులో బండి సంజయ్ రిమాండ్ రద్దుపై విచారణ
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
గత పదిరోజులుగా క్వింటా ధర దాదాపు రూ.2,500 పెరిగింది. ఈ నెల ప్రారంభంలో క్వింటా నిమ్మకాయల ధర రూ.4 నుంచి 6 వేల మధ్య ఉండగా, గత వారం రోజుల్లో రూ.7 నుంచి 8 వేలకు చేరడంతో వినియోగ దారులు లబోదిబో మంటున్నారు. ఇప్పుడు ఇంకాస్త ధర పెరిగింది. నిమ్మ మార్కెట్ కు ప్రసిద్ధి చెందిన ఏలూరులో క్వింటా ధర రూ.8,700 పలుకుతోంది. కనీస ధర రూ.3,500 ఉంది. ఇక ఆఫ్‌సీజన్‌లో క్వింటా రూ.1000 కూడా కొందరు ఈ-నామ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. సరుకు ధర నాణ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. వేసవి ఎండలు ముదురుతుండడంతో నిమ్మకాయల వినియోగం పెరిగింది. చిల్లర వ్యాపారులు కాయ సైజును బట్టి పెద్దవి రూ.10, చిన్నవి రూ.5 నుంచి 6 చొప్పున విక్రయిస్తున్నారు. ఏలూరు, తెనాలి, రాపూరు, దెందలూరు తదితర మార్కెట్ యార్డులకు నిమ్మకాయల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
ఒక్క ఏలూరు మార్కెట్‌కే రోజుకు 4వేలకు పైగా నిమ్మకాయలు దిగుమతి అవుతుండగా, తెనాలి, రాపూరు, దెందులూరు మార్కెట్‌లకు వందల సంఖ్యలో నిమ్మకాయలు వస్తున్నాయి. గత నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఈదురు గాలులకు నిమ్మతోటలు దెబ్బతినగా కొన్ని కాయలు దెబ్బతిన్నాయి. మంగు మరియు మచ్చల తెగుళ్లు కూడా ఉన్నాయి. నాణ్యమైన, పెద్ద సైజు నిమ్మకాయలకు అధిక ధరలు పలుకుతున్నాయి. సీజనల్ డిమాండ్ కారణంగా చిన్న సైజు, పసుపు పచ్చగా పండిన కాయలు సాధారణ రోజుల కంటే కొంచెం ఎక్కువ ధర పలుకుతున్నాయి. మరో రెండు నెలల పాటు నిమ్మకాయలకు గిరాకీ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల్లో నిమ్మతోటలున్నాయి. కొండ ప్రాంతాల్లో మోటార్ల కింద తోటలు సాగు చేస్తున్నారు. ఏటా దాదాపు 10 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఎండాకాలంలో ఎండు తెగులు సోకిందని, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడి తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. వేసవి దిగుబడి పడిపోవడం, నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు పెరుగుతున్నాయి.
Beer Bus: చెన్నై నుండి పుదుచ్చేరి.. బీర్ బస్ ప్రయాణం.. ఇందులో విశేషమేమిటంటే..
తాజావార్తలు
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?