మనకు ప్రకృతి ఎన్నో ప్రసాదించింది. ఆరోగ్యాన్ని అందించేందుకు, మనల్ని నిరంతరం ఉత్సాహంగా ఉంచేందుకు ఎన్నో రకాల పండ్లు ఇచ్చింది. అందులో కివీ ఫ్రూట్స్ ఒకటి. డాక్టర్ల చేత వండర్ ఫ్రూట్ అని పిలిపించుకున్న కివీలో ఎన్నో రకాల ప్రయోజనాలు వున్నాయి. దాదాపు 27 రకాల పండ్లలలో లభించే పోషకాలు ఒక్క కివీ పండులో లభిస్థాయని చెబితే మీరు ఆశ్చర్యపడక మానరు.
* నారింజ, యాపిల్, బత్తాయి లాంటి పండ్ల కన్నా ఇందులో విటమిన్ సి రెట్టింపు మోతాదులో ఉంటుంది.
* యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులో కలిగి ఉన్నాయని కనుగొన్నారు. ఇందులో సి విటమిన్ తో పాటు విటమిన్ ఇ, పోటాషియం, ఫోలిక్ యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్ వంటి ఎన్నో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
* కివీ పండు తింటే మీ శరీరానికి సమతులాహారం అందినట్టే.
* అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గాలనుకుంటే కివీ పండు ఒక అద్భుత వరం. దీనిని తీసుకుంటే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
* అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది.
* కివీ పండు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తుంది.
* ఈమధ్య కాలంలో రక్తనాళాలకు ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. అలాంటివారు ఈ కివీ పండు తింటే రక్తనాళాల్లో రక్తం సరఫరా మెరుగుపడుతుంది.
* రక్తనాళాల్లోనే రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. ఇందులో ఉండే సోడియం రక్తపోటును తగ్గించి గుండె జబ్బులు రాకుండా దూరం చేస్తుంది.
* కివీ పండులోని విటమిన్స్ రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
* కివీ పండులో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఎంతో దోహదపడుతుంది.
* మీరు ఎక్కువగా కివీపండ్లు తింటే మీకు సుఖ విరేచనం అవుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
* క్యాన్సర్ రావడానికి కారణం అయ్యే కారకాలతో పోరాడుతుంది. కివీలో యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ మరియు బీ.పీ ని అదుపులో ఉంచుతాయి
* కంటిసంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
* వయసు పెరుగుదల వల్ల వచ్చే కణాల క్షీణతను తగ్గిస్తాయి.
* గర్భణీ మహిళలలు కివీ పండును తీసుకోవడం చాలా మంచిది.
ఇంత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ పండును కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకోండి. మీ అనారోగ్య సమస్యల నుంచి దూరం కండి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.