Kidney Health Foods: కిడ్నీ ఆరోగ్యానికి వరం లాంటి ఆహారాలు ఇవే.. ప్రయోజనాలు ఎన్నో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Health Foods: మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పెరుగుతోంది. ఒక్కసారి కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే, ఆ ప్రభావం శరీరంలోని ఇతర అవయవాల పైన కూడా పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో కొన్ని రకాల పోషకాహారాలను చేర్చుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.
కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఇవే:
Also Read
- Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
- Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
- Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే 'మసాలా పన్నీర్ పరాటా' ఇలా చేసుకోండి..!
- Child Stomach pain: స్కూల్‌కు వెళ్లే ముందు పిల్లలు కడుపునొప్పి అంటున్నారా..? అసలు కారణం ఇదే కావచ్చు!
* కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ మన మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
* బెర్రీ పండ్లు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీ పండ్లలో ఔషధ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. రోజూ వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
* క్యాబేజీ: క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలతో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి.
* రెడ్ క్యాప్సికం: రెడ్ క్యాప్సికంలో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.
వీటితో పాటు ఆకుకూరలు, తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. కిడ్నీలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది. ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తే కిడ్నీలే కాదు, శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Kidney Health Foods: కిడ్నీ ఆరోగ్యానికి వరం లాంటి ఆహారాలు ఇవే.. ప్రయోజనాలు ఎన్నో!
-
Meenakshi Chaudary : ఆ సీక్రెట్ లీక్ చేస్తే డైరెక్టర్ నన్ను చంపేస్తారు!”
-
Alias Rukmini : వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌ను నమ్మి రిస్క్ చేశారా?
-
Alias Rukmini: ‘వృషకర్మ’తో నాని టీమ్ పోటీ.. డిసెంబర్ 4 రిలీజ్ వెనుక అసలు రహస్యమిదే!
-
Lotus Pond Land Auction: లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత! అమ్మకానికి వేల కోట్ల భూమి..
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!