Kidney Health Foods: కిడ్నీ ఆరోగ్యానికి వరం లాంటి ఆహారాలు ఇవే.. ప్రయోజనాలు ఎన్నో!

Kidney Health Foods

Kidney Health Foods

Kidney Health Foods: మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పెరుగుతోంది. ఒక్కసారి కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే, ఆ ప్రభావం శరీరంలోని ఇతర అవయవాల పైన కూడా పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో కొన్ని రకాల పోషకాహారాలను చేర్చుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.

కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఇవే:

* కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ మన మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

* బెర్రీ పండ్లు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీ పండ్లలో ఔషధ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. రోజూ వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

* క్యాబేజీ: క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలతో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి.

* రెడ్ క్యాప్సికం: రెడ్ క్యాప్సికంలో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.

వీటితో పాటు ఆకుకూరలు, తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. కిడ్నీలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది. ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తే కిడ్నీలే కాదు, శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.