Site icon NTV Telugu

Bird Flu: 10 రాష్ట్రాల్లో 41 ప్రదేశాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. పులులు, సింహాలకు సైతం వైరస్..!

Bird Flu

Bird Flu

2025లో భారతదేశంలో ప్రధానంగా 10 రాష్ట్రాల్లో 41 ప్రదేశాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వ్యాప్తి జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బాఘెల్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పులి, సింహం, చిరుతపులి, పెంపుడు పిల్లులు వంటి పక్షులేతర జాతులలోనూ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయని నిర్ధారించారు. ఇది సాధారణంగా ఊహించిన దానికంటే విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇది మానవులకు సైతం వ్యాప్తి చెందుతోందని రిపోర్టు ద్వారా తెలిపారు.

READ MORE: Oval Test: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ తుది జట్టులో మూడు మార్పులు! మళ్లీ వచ్చేశాడు బాబోయ్

రిపోర్టు ప్రకారం.. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే, 2025 లో H9N1(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ)) వైరస్ వ్యాప్తి తక్కువగా నమోదైంది. జూలై 24 వరకు, ఈ సంవత్సరం 41 కేసులు నమోదయ్యాయి. 2024లో 49 కేసులు నమోదు కాగా.. గత ఐదేళ్లలో అత్యధిక కేసులు 2021లో(118) నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి దేశీయ కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నమోదైంది. పెరుగుతున్న ముప్పును పరిష్కరించడానికి, నివారణ, నిఘా, వేగవంతం చేశాం. బయోసెక్యూరిటీ చర్యల అమలు వంటి వాటికి సమగ్ర మార్గదర్శకాలను అందించడానికి ప్రభుత్వం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను (సవరించిన 2021) రూపొందించింది. వన్యప్రాణులు, ఆరోగ్య అధికారుల సమన్వయంతో అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో నిఘాను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సలహాలు జారీ చేశారు. వ్యాధి రహిత, స్థితిస్థాపక పౌల్ట్రీ రంగాన్ని నిర్మించడానికి పౌల్ట్రీ డిసీజ్ యాక్షన్ ప్లాన్ అభివృద్ధి చేశారు. ఈ వ్యాధితో కోళ్లు మృతి చెందడంతో పౌల్ట్రీ యజమానులకు పరిహారం చెల్లించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు భాగస్వామ్య ప్రాతిపదికన ఆర్థికంగా సహాయం చేస్తాయి.

READ MORE: ICC Rankings: మనల్ని ఎవర్రా ఆపేది.. ఐసీసీ ర్యాంకింగ్స్‎లో టాప్ లేపిన టీమిండియా స్టార్స్..!

Exit mobile version