NTV Telugu Site icon

Side Effects of Over Sitting: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? .. ఎంత ప్రమాదమంటే?

Over Sitting

Over Sitting

ఆఫీసుల్లో, ఇళ్లలో కొంత మంది కుర్చీలకు అంటి పెట్టుకున్నట్లు కూర్చుంటారు. అంతే కాదు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోతుంటారు. మీరు కూడా గంటల తరబడి ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ కూర్చుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు గంటల తరబడి కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికనట్లే అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు కూర్చున్నట్లయితే.. త్వరలో గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా కూర్చునే వారిలో గుండె, మెదడు, కాలేయం, కిడ్నీలపైన ప్రభావం పడి.. పనితీరు మందగిస్తుందని చెబుతున్నారు. ఇలా శారీరక శ్రమ తక్కువగా చేసే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువంటున్నారు. ఫలితంగా జీవిత కాలం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.

READ MORE: Koti Deepotsavam 2024 Day 12: ఘనంగా వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వర ఆది దంపతుల కల్యాణోత్సవం

ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం వల్ల కండరాల్లో కదలికలు లేకుండా పోతుందట. ఫలితంగా తీసుకున్న ఆహారం కొవ్వుగా మారి.. శరీరంలో అక్కడక్కడ పేరుకుపోయి స్థూలకాయం బారిన పడే అవకాశం ఉంది. కాళ్లలో రక్త ప్రసరణ తగ్గిపోయి.. రక్త నాళాల్లో ఒత్తిడి పెరిగుతోంది. ఫలితంగా రక్త నాళాలు వ్యాకోచించి ఉబ్బిపోతాయి. దీంతో వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందట. కాళ్ల నుంచి మొదలై ఊపిరితిత్తుల వరకు వ్యాపించి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. వెన్ను కండరాలపై ఒత్తిడి తీవ్రంగా పడి.. మెడ, వెన్నుపూస ఒత్తిడికి గురై పాడైపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా ఎక్కువ సేపు కూర్చోని ఉండడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

READ MORE:Kishan Reddy: ది సబర్మతి రిపోర్ట్ సినిమా చూసిన కిషన్ రెడ్డి.. ఏమన్నారంటే?

వారిలో తక్కువ కేలరీలు కరిగిపోయి.. కొవ్వు పెరిగిపోయి క్రమంగా డయాబెటిస్ బారిన పడతారట. ఇంకా అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు. అలాగే వీరిలో కదలికలు లేకపోవడం వల్ల రక్త ప్రసరణ వేగం మందగించి.. క్రమంగా గుండె సమస్యలు కూడా వస్తుంటాయని అంటున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందట. ముఖ్యంగా పేగు, ఎండో మెట్రియల్ ఊపిరితిత్తుల క్యాన్సర్, వయసు పైబడిన వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందట. అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ప్రతిరోజు సగటను 7-8వేల అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పని ప్రదేశంలో ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా ప్రతి గంటకు కనీసం 3 నిమిషాల పాటు అటు ఇటూ నడవాలట. నిత్యం నడక, వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు పాటించాలని సూచిస్తున్నారు.