NTV Telugu Site icon

Health Tips: రోజూ ‘మెంతి టీ’ని తాగండి.. ఆ సమస్యలకు చెక్ పెట్టండి..!

Fenugreek Tea

Fenugreek Tea

రోజూ ఉదయం టీ తాగడం అందరికీ అలవాటే. అయితే.. పోషకాలు అధికంగా ఉండే మెంతి టీని తాగినట్లైతో మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతుల్లో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. యామోజెనిన్, క్లోరిన్, కాల్షియం, కాపర్, పొటాషియం, ఐరన్, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెంతి టీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో.. జీర్ణక్రియకు సహాయం చేయడం.. రక్తంలో చక్కెర, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. మెంతి టీని మెంతి మొక్కలో ఉండే గింజల నుండి తయారు చేస్తారు. మెంతి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏంటో తెలుసుకుందాం.. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ విటమిన్ అండ్ న్యూట్రిషనల్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. మెంతులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ విత్తనాల నుండి తయారైన మెంతి టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది.

Read Also: Harshit Rana: చెలరేగిన హర్షిత్.. 6 బంతుల్లో 4 వికెట్లు

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
బరువు తగ్గడానికి మెంతి టీ ఒక గొప్ప ఎంపిక. మెంతి టీ తాగడం వల్ల శరీరంలో కూరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. మీ జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
మెంతి టీ మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఆరోగ్యవంతమైన చర్మానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించడానికి, మీ చర్మ ఛాయను మెరుగుపరచడానికి, చర్మం వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది. మెంతి టీ మీ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జీర్ణక్రియకు మంచిది
మెంతి టీ మీ కడుపు ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వాపు, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఫైటోథెరపీ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, మెంతి టీ మీ ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తుంది. దీంతో.. చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.