Site icon NTV Telugu

AIDS: ఎయిడ్స్ లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే కాదు.. ఈ మార్గాల ద్వారా కూడా వ్యాప్తి..

Aids

Aids

ఎయిడ్స్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. దీని గురించి ప్రజల మనసులో ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజున తీవ్రమైన వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. సాధారణంగా ఈ వ్యాధి గురించి బహిరంగంగా మాట్లాడేందుకు సంకోచిస్తారు. ఎందుకంటే శారీరక సంబంధాలు అంటే లైంగిక కార్యకలాపాల వల్ల మాత్రమే ఎయిడ్స్ ప్రజలను బాధితులుగా మారుస్తుందనే అపోహను ప్రజలు నమ్ముతారు. మరి కొన్ని మార్గాల ద్వారా కూడా ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

RED MORE: Srishti Tuli: పైలట్ ప్రియుడు మామూలోడు కాదు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఘనకార్యాలు

వ్యక్తి రూపాన్ని బట్టి హెచ్ఐవీ ఉందో లేదో అస్సలు గుర్తించలేరు. హెచ్ఐవీ ఉన్నవారు ఎన్ని సంవత్సరాలైనా ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఎవరికైనా సోకిందో లేదో తెలుసుకోవడం కేవలం హెచ్ఐవీ పరీక్ష ద్వారే సాధ్యం. అయితే.. కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్ చేయడం, తిన్న ప్లేట్స్‌లోనే తినడం, ఒకే గదిలో ఉండడం వంటి సాధారణ కాంటాక్ట్స్ ద్వారా హెచ్ఐవీ రాదు. కాగా.. ప్రధానంగా లైంగిక సంపర్కం ద్వారా ఎయిడ్స్‌ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక సంబంధం లేకుండా కూడా ఈ ప్రమాదకర వ్యాధి సోకుతుందట. సాధారణంగా ఈ వ్యాధి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) వల్ల వస్తుంది. HIV-సోకిన వ్యక్తికి వాడిన సూదులు లేదా సిరంజీలను వేరొకరికి ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. హెచ్ఐవీ ఉన్న తల్లి బిడ్డకి పాలిస్తే ఆ సమయంలో వస్తుంది.

RED MORE:Scissors In Abdomen: మహిళ కడుపులో కత్తెర.. చూసి షాకైన డాక్టర్లు

నివారణ ఎలా?
సెక్స్ చేసిన ప్రతిసారి కొత్త కండోమ్ వాడాలి. ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడొద్దు. వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ మాత్రమే వాడాలి. రక్తం ఎక్కించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎప్పుడూ కొత్త సిరంజీనే ఉపయోగించాలి.

Exit mobile version