Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tips Healthy Ragi Bellam Ariselu Recipe Bone Health Kids Sweet

Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్‌గా ఇలా చేసేయండి!

Published Date :May 11, 2026 , 6:18 pm
By Shiva Ganesh
Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Ragi Bellam Ariselu: ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది రుచికంటే ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా స్వీట్స్ విషయానికి వస్తే ‘బరువు పెరుగుతామేమో’ లేదా ‘షుగర్ వస్తుందేమో’ అన్న భయం అందరిలోనూ ఉంటుంది. అయితే మన పూర్వీకులు అందించిన చిరుధాన్యాల గొప్పతనాన్ని, సంప్రదాయ అరిసెల రుచిని కలిపి వండితే ఎలా ఉంటుంది? అదే “రాగి బెల్లం అరిసెలు”. రాగుల్లో ఉండే కాల్షియం, బెల్లంలో ఉండే ఐరన్ కలగలిసి రక్తహీనతను తగ్గించడమే కాకుండా ఎముకల పుష్టికి ఎంతగానో తోడ్పడతాయి. ఇవి బియ్యం అరిసెల కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. పండగలు వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినా.. చిటికెలో, ఎంతో రుచిగా ఈ రాగి అరిసెలను ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

Also Read

  • Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ 'రాగి సమోసా'ను 'సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!
  • Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
Add as a preferred
source on google

రాగి పిండి: 2 గ్లాసుల

బెల్లం: 1 గ్లాసు రాగి పిండికి అర గ్లాసు కంటే కొంచెం ఎక్కువ (అచ్చు బెల్లం అయితే శ్రేష్టం)

నీళ్లు: అర గ్లాసు (పాకం కోసం)

నువ్వులు: అరిసెలపై అద్దుకోవడానికి

నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం:
ముందుగా రాగి పిండి తీసుకొని, అందులో కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ తడి పొడిగా కలుపుకుని 2 గంటలు పక్కన పెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టి, మళ్లీ పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. నీళ్లలో పాకం వేస్తే అది ఉండ కట్టే వరకు (ఉండ పాకం) ఉడికించాలి. పాకం రాగానే స్టవ్ ఆపేసి, రాగి పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. పిండి అంతా పాకంలో బాగా కలిసేలా చూసుకోవాలి.

తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ లేదా అరిటాకుపై కొంచెం నూనె రాసి, చిన్న పిండి ముద్దను తీసుకుని నువ్వుల్లో అద్ది, అరిసెలా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకుని, మీడియం వేడి ఉన్న నూనెలో వేయించాలి. అరిసె గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే తీసి, అరిసెల గరిటెతో గట్టిగా నొక్కి ఎక్స్‌ట్రా నూనెను తీసేయాలి. ఈ రాగి బెల్లం అరిసెలు కాల్చుకునేటప్పుడు మంటను ఎప్పుడూ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి, లేదంటే పైన మాడిపోయి లోపల కాలవు. 1 కిలో రాగి పిండికి ముప్పావు కిలో బెల్లం సరిపోతుంది. సింపుల్‌గా ఇంట్లోనే ఆరోగ్యకరమైన రాగి బెల్లం అరిసెలను ఎలా తయారు చేసుకోవచ్చు తెలుసుకున్నారు కదా.. కుదిరితే మీ ఇంట్లో కూడా ప్రయత్నించి చూడండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bone Health Foods for Children
  • Finger Millet Jaggery Sweet
  • Healthy Ariselu Preparation
  • Healthy Indian Sweets
  • iron rich sweets

తాజావార్తలు

  • Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Hyderabad Census : హైదరాబాద్‌లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!

  • Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు

  • Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్

  • Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions