Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Bellam Ariselu: ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది రుచికంటే ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా స్వీట్స్ విషయానికి వస్తే ‘బరువు పెరుగుతామేమో’ లేదా ‘షుగర్ వస్తుందేమో’ అన్న భయం అందరిలోనూ ఉంటుంది. అయితే మన పూర్వీకులు అందించిన చిరుధాన్యాల గొప్పతనాన్ని, సంప్రదాయ అరిసెల రుచిని కలిపి వండితే ఎలా ఉంటుంది? అదే “రాగి బెల్లం అరిసెలు”. రాగుల్లో ఉండే కాల్షియం, బెల్లంలో ఉండే ఐరన్ కలగలిసి రక్తహీనతను తగ్గించడమే కాకుండా ఎముకల పుష్టికి ఎంతగానో తోడ్పడతాయి. ఇవి బియ్యం అరిసెల కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. పండగలు వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినా.. చిటికెలో, ఎంతో రుచిగా ఈ రాగి అరిసెలను ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
రాగి పిండి: 2 గ్లాసుల
బెల్లం: 1 గ్లాసు రాగి పిండికి అర గ్లాసు కంటే కొంచెం ఎక్కువ (అచ్చు బెల్లం అయితే శ్రేష్టం)
నీళ్లు: అర గ్లాసు (పాకం కోసం)
నువ్వులు: అరిసెలపై అద్దుకోవడానికి
నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా రాగి పిండి తీసుకొని, అందులో కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ తడి పొడిగా కలుపుకుని 2 గంటలు పక్కన పెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టి, మళ్లీ పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. నీళ్లలో పాకం వేస్తే అది ఉండ కట్టే వరకు (ఉండ పాకం) ఉడికించాలి. పాకం రాగానే స్టవ్ ఆపేసి, రాగి పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. పిండి అంతా పాకంలో బాగా కలిసేలా చూసుకోవాలి.
తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ లేదా అరిటాకుపై కొంచెం నూనె రాసి, చిన్న పిండి ముద్దను తీసుకుని నువ్వుల్లో అద్ది, అరిసెలా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకుని, మీడియం వేడి ఉన్న నూనెలో వేయించాలి. అరిసె గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి, అరిసెల గరిటెతో గట్టిగా నొక్కి ఎక్స్ట్రా నూనెను తీసేయాలి. ఈ రాగి బెల్లం అరిసెలు కాల్చుకునేటప్పుడు మంటను ఎప్పుడూ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి, లేదంటే పైన మాడిపోయి లోపల కాలవు. 1 కిలో రాగి పిండికి ముప్పావు కిలో బెల్లం సరిపోతుంది. సింపుల్‌గా ఇంట్లోనే ఆరోగ్యకరమైన రాగి బెల్లం అరిసెలను ఎలా తయారు చేసుకోవచ్చు తెలుసుకున్నారు కదా.. కుదిరితే మీ ఇంట్లో కూడా ప్రయత్నించి చూడండి.
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!