NTV Telugu Site icon

Health Tips: రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఉదయం వీటిని తప్పక తీసుకోవాలి..

Energy Food

Energy Food

వేసవి కాలంలో ఆహరం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. ఎందుకంటే మనం ఎలా తీసుకున్న కూడా హైడ్రెడ్ గా లేకుంటే మాత్రం నీరసం తో పడిపోతారు.. అందుకే వేసవిలో ఆహార నియామాలను పాటించాలని నిపుణులు అంటున్నారు.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే కొన్ని గంటల తర్వాత మీకు విపరీతమైన ఆకలి పుడుతుంది. ఇదికాస్త మీరు అతిగా తినడానికి దారితీస్తుంది. దీంతో మీరు ఊబకాయం బారిన పడతారు. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఖచ్చితంగా తినాల్సినవి ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

*. పొద్దున్నే లేవగానే నీళ్లను తాగడం చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే.. కానీ అందరు మర్చిపోతారు..నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీవక్రియను సులభతరం చేయడానికి సహాయపడతాయి. ఉదయం తినడానికి ముందుగా నీటిని తాగితే ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు బరువును నియంత్రించుకోవచ్చు. పుష్కలంగా నీటిని తాగడం వల్ల మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.. చర్మాన్ని పొడి బారకుండా చేస్తుంది..

*. ఉదయం మీరు తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చేర్చండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఆకలిని తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో మీరు బరువును నియంత్రించుకోవచ్చు..

*. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది..రోజంతా హైడ్రేట్ గా, శక్తివంతంగా ఉండటానికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం చాలా చాలా అవసరం. అలాగే బరువు తగ్గడానికి ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆకలిని తగ్గించి హార్మోన్ల స్థాయిని పెంచి శరీరానికి వెంటనే ఎనర్జీని ఇస్తుంది..

*. ఉదయాన్నే చక్కెర ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. ఎక్కువ మొత్తంలో స్వీటెనర్లు శరీరానికి చేరడం వల్ల కడుపులో కొవ్వు పేరుకుపోతుంది. ఇది కేలరీలు పెరగడానికి కూడా కారణమవుతుంది.. సో తీపి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..

*.చాలా మందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందుకే వీటికి బదుదలుగా నిమ్మకాయ, తేనెను కలిపిన గోరువెచ్చని నీటిని తాగండి. ఇది జీవక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది.. జీవక్రియ కూడా మెరుగవుతుంది.. ఇవి తాగాక కొద్ది నిమిషాలకు టీ, కాఫీ లను తీసుకోవచ్చు..

Show comments