NTV Telugu Site icon

Health Tips: రోజుకు ఒక స్పూన్ అవిసె గింజలు తింటే ఆ వ్యాధులకు వణుకే..

Flaxseeds

Flaxseeds

అవిసె గింజలు చాలా పోషకమైనవి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ చిన్న విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. అయితే అవిసె గింజలను పచ్చిగా తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల పూర్తి పోషకాలు శరీరానికి అందవని వెల్లడిస్తున్నారు. అవిసె గింజలను వేయించి తినాలని సూచిస్తున్నారు.

Also Read:Shocking: పోలీస్ స్టేషన్‌కి 100 మీటర్ల దూరంలో, ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం..

అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అవిసె గింజల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇవి మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Also Read:Mysterious Disease: కాంగోలో వింత వ్యాధి.. రెండ్రోజుల్లో 50 మంది మృతి

అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవిసె గింజల్లో యాంటీఆక్సిడెంట్లు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. ఇవి జుట్టుకు కూడా పోషననిస్తాయి. అవిసె గింజలలో లిగ్నన్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.