Health Tips: మెంతులు మాత్రమే కాదు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో మెంతికూర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మెంతికూరను మనం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మెంతులు మన ఆరోగ్యానికి ఎంత దోహదపడతాయో, మెంతికూర తినడం వల్ల మరెన్నో ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మెంతికూరలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. మెంతికూరను ఆహారంలో చేర్చుకుంటే మధుమేహం కంట్రోల్ ఉంటుంది. మెంతి ఆకుల్లో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరానికి కావలసిన పోషకాలను అందజేసి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెంతి గింజల ఆకులు అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడతాయని పరిశోధనలో వెల్లడైంది.మెంతికూరతో ఉపయోగించడంటైప్ వన్,టైప్ టూ మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో మెంతి ఆకులు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. మెంతులు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ-వైరల్ లక్షణాలు అనేక నొప్పులు, వాపులను తగ్గించడంలో బాగా పని చేస్తాయి.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
మెంతులు లైంగిక సమర్థతకు కూడా పెంచుతుంది. లైంగికంగా చాలా వీక్ గా వున్న వారికి మెంతికూర తినడం వల్ల వారి సమర్థతకు బాగా ఉపయోగపడతాయి. మెంతులు మలబద్ధకం, ప్రేగు సంబంధిత ఆరోగ్య సమస్యలు, మూత్రపిండాల వ్యాధి, కాలిన గాయాలు, ఇతర ఆరోగ్య సమస్యల చికిత్సలో బాగా పని చేస్తాయి. మనం రోజువారీ ఆహారంలో మెంతులు లేదా మెంతి గింజలు చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచించారు. మెంతికూరలోని పోషకాలు గుండెకు మేలు చేస్తాయి. మెంతికూరలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు కంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మెంతికూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెంతికూర తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. మెంతులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. మెంతులు మన జుట్టు , చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ని ప్రయోజనాలతో మెంతికూరను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. కానీ అతిగా తినడం వల్ల అనర్థాలకు కూడా దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకుని, తగినంత పరిమాణంలో మెంతి కూర తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Bouncer Murder Case: బౌన్సర్ మృతి కేసులో ట్విస్ట్..! భార్యను అసభ్యంగా దూషించాడని హత్య..