NTV Telugu Site icon

Health Tips: రోజుకో లవంగం తింటే బోలెడు ప్రయోజనాలు..

Helth Benifits

Helth Benifits

Health Tips: మన వంటిట్లోనే అనారోగ్య సమస్యలను నియంత్రించే ఔషధాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం అలాంటి ఔషధాలపై పెద్దగా దృష్టిసారించం. అలాంటి దినుసుల్లో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది. దీని రుచి ఘాటుగా ఉంటుంది. లవంగాలను మనం రోజూ తింటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీనిని ఆహారంలో రుచి, వాసనను జోడించడానికి ఉపయోగిస్తారు. ఇది వంటగదికే పరిమితం కాదు. లవంగాలు నాన్-వెజ్ వంటకాలకు, వెజ్ బిర్యానీకి రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. లవంగాలలో ప్రొటీన్లు, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-కె పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఉదయాన్నే లవంగాలను తీసుకోవడం వల్ల అనేక శారీరక సమస్యలను అధిగమించవచ్చు.

గ్యాస్‌ సమస్య..
చాలా మందికి ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. అటువంటి వారికి ఆహారం తిన్న తర్వాత గ్యాస్ సమస్యలు వస్తాయి. గ్యాస్ సమస్యను అధిగమించేందుకు లవంగం ఔషధంగా పనిచేస్తుంది. గ్యాస్, మలబద్ధకం సమస్య నుండి బయటపడటానికి ఒక లవంగాన్ని నమిలి రసాన్ని తీసుకోవడం వలన గ్యాస్‌ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

జలుబు..
మారుతున్న కాలంతో పాటు జలుబు వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఒక లవంగాన్ని నోటిలో పెట్టుకోండి. రోజూ లవంగాలు తినడం వల్ల జలుబు, గొంతు నొప్పి రాకుండా ఉంటాయి.

నోటి దుర్వాస..
ఆకలి వేస్తున్నా ఎక్కుసేపు ఉండటం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. దీనిని దూరం చేయడానికి లవంగం చాలా ఉపయోగ పడుతుంది. నటి దుర్వాసన రాకుండా లవంగం నోటిలో వేసుకుని దాన్ని రసాన్ని సేవించడం వలన నోటి దుర్వాసన నుంచి విముక్తి కలుగుతుంది.

బరువును నియంత్రణ..

పెరుగుతున్న బరువు నియంత్రించడానికి ఖచ్చితంగా లవంగం రెమెడీని ప్రయత్నించండి. ఈ పరిహారం చేయడానికి, ప్రతిరోజూ ఒక లవంగాన్ని నమలండి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గవచ్చు.

చక్కెర నియంత్రణ..
లవంగాలు తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. లవంగాలలోని నైజీరిన్ అనే పదార్థం ఇన్సులిన్‌ను పెంచడానికి పని చేస్తుంది.
Tomato Price: పైపైకి టమోటా ధర.. రైతుల ఆనందం..

Show comments