ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కోట్లు కుమ్మరించినా తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారనే గ్యారంటీ లేదు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు మోషన్ కి వెళ్లే విధానాన్ని బట్టి చెప్పొచ్చు. అంటే మీ గట్ హెల్తీగా ఉంటే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే. గట్ ఆరోగ్యంపైనే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అలాంటి హెల్తీ గట్ మీ సొంతం కావాలి అంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ఈ మధ్యకాలంలో డైట్ పేరుతో ఇష్టానుసారం ఆహారాన్ని తీసుకుంటూ శరీరాన్ని చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. మంచి ఆరోగ్యం కోసం ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, ఆకు కూరలు, హోల్ గ్రెయిన్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజులో శరీరానికి కావాల్సినన్ని మంచినీళ్లు తాగాలి. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత బాగా జీర్ణ వ్యవస్థ పని చేస్తుంది. ప్రో బయోటిక్ రిచ్ గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. అంటే పాలు, పాల పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం తగ్గించాలి. వీలైతే పూర్తిగా మానేస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. హెల్తీ గట్ కోసం శరీరానికి వ్యాయామం కూడా అవసరం. రోజూ తప్పకుండా ఎక్సర్ సైజ్ చేయాలి. కంటి నిండా నిద్రపోవడం కూడా హెల్తీ గట్ కు ఉపయోగపడుతుంది.
సరైన నిద్రతో జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది. అధిక ఒత్తిడి కూడా మీ గట్ మీద ప్రభావం చూపుతుంది. గట్ హెల్త్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం యోగాను అలవర్చుకోవాలి. హెల్తీ గట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. హేల్తీ గట్ వ్యాధి నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. హేల్తీ గట్ అనేది.. మీ మెంటల్ హెల్త్ మీద కూడా ప్రభావం చూపుతుంది. హెల్తీ గట్.. విటమిన్ కే, బయోటిన్ అనే విటమిన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు మద్యం ఎక్కువగా తీసుకుంటే.. గట్ మైక్రోబ్‌కు అంతరాయం కలుగుతుంది. పేగు ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండం మంచిదంటున్నారు నిపుణులు.