NTV Telugu Site icon

Hair Fall Tips: జుట్టు ఎక్కువగా రాలుతుందా..? ఈ రసాన్ని ట్రై చేయండి

Hair

Hair

జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. దానిని నియంత్రించడం కోసం ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. జట్టు రాలడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. జుట్టులో రక్త ప్రసరణ లేకపోవడం, చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్. ఈ కారణాల వల్ల జుట్టు మూలాలు బలహీనంగా మారిపోయి.. జుట్టు రాలడం సమస్య పెరిగిపోతుంది. అయితే.. జుట్టు రాలకుండా ఉండేందుకు నిమ్మకాయ రసం అద్భుతంగా పని చేస్తుంది. దీనిని వాడటం వల్ల జుట్టు ఊడటం కంట్రోల్‌లో ఉంటుంది. నిమ్మరసాన్ని ఆవనూనెలో కలిపి జుట్టుకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది జుట్టు యొక్క రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాకుండా.. చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. దీంతో జుట్టు రాలడం తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అదనంగా.. జుట్టు యొక్క బలహీనమైన మూలాలను బలపరుస్తుంది.

Read Also: Trisha : 40 ప్లస్‌లో సత్తా చాటుతున్న ‘త్రిష’

నిమ్మకాయ హెయిర్ ప్యాక్:
జుట్టుకు నిమ్మకాయ హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇందుకోసం నిమ్మరసంలో కాస్త అలోవెరా జెల్, గుడ్డు మిక్స్ చేస్తే చాలు. ఆ తర్వాత జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పోషణను అందిస్తుంది. దీంతో.. జుట్టు పెరుగుదల వేగంగా పెరుగుతుంది. నిమ్మరసంలో కొంత ఆమ్లా నీటిని మిక్స్ చేసి జుట్టుకు రాసుకుంటే.. మూలాల నుండి జుట్టును బలపరుస్తుంది.

నిమ్మ, ఆముదం:
నిమ్మ, ఆముదంతో తయారు చేసిన నూనె జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడుతుంది. మీరు చేయాల్సిందల్లా నిమ్మకాయ రసాన్ని తీసి ఆముదంతో మిక్స్ చేసి.. ఆపై మీ జుట్టుకు అప్లై చేయడమే.. ఇది జుట్టు యొక్క రక్త ప్రసరణను పెంచుతుంది.. జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి శీతాకాలంలో జుట్టు సమస్యలకు ఈ రెమెడీస్ ట్రై చేయండి.

Show comments