NTV Telugu Site icon

Rebecca Syndrome: మీ మాజీని మరిచిపోలేకపోతున్నారా..? ఈ వ్యాధి బారిన పడ్డట్టే..!

Rebecca Syndrome

Rebecca Syndrome

ఎవరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్న తర్వాత విడిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ.. విడిపోతే ఆ బాధ తమ మనస్సు, హృదయం నుండి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. అయితే.. కొందరు విడిపోయిన వెంటనే మరో లైఫ్ లోకి ప్రవేశించి జీవితం గడుపుతారు. మరికొందరు ఆ బాధను మరిచిపోలేక వారి మాజీల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఇలా ఆలోచించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Read Also: Supreme court: మోడీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

కొంత మంది వ్యక్తులు తమ మాజీ భాగస్వామిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా.. వారి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వారు ఏం చేస్తున్నారు.. వారి ఫోటోలు, ఇతర విషయాలను తెలుసుకునేందుకు వెతుకుతూనే ఉంటారు. ఇలా.. రిలేషన్ షిప్ నుంచి విడిపోయిన తర్వాత కూడా.. వదిలిపెట్టడం లేదంటే వారు రెబెక్కా సిండ్రోమ్‌తో బాధ పడుతున్నారని అర్థం. అసలు రెబెక్కా సిండ్రోమ్ అంటే ఏమిటి..?

Read Also: Pemmasani Chandra Shekar: అక్రమాలకు తావు లేకుండా ‘ఆవాస్’ లబ్ధిదారుల ఎంపిక

రెబెక్కా సిండ్రోమ్:
డాక్టర్ డారియన్.. లీడర్, మానసిక విశ్లేషకుడు.. లండన్‌లోని సెంటర్ ఫర్ ఫ్రూడియన్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ వ్యవస్థాపక సభ్యుడు ఈ సిండ్రోమ్‌కు పేరు పెట్టారు. గతంలో రిలేషన్ షిప్‌లో ఉన్న ఆలోచనలే గుర్తొస్తాయి.. దానిని గుర్తు పట్టడం మీ ప్రస్తుత భాగస్వామికి తెలుస్తుందని అన్నారు. ఈ క్రమంలో.. ప్రస్తుత భాగస్వామి కోపంతో, అసూయతో ఉంటుంది. ఈ అసూయ రెట్రోయాక్టివ్‌లో పాతుకుపోతుందని అన్నాడు. మీకు రెబెక్కా సిండ్రోమ్ ఉందని అనుకుంటే ఏమి చేయాలి..? ఇలాంటి పరిస్థితుల్లో గతానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. మీ గతం మీ ప్రస్తుత సంబంధాన్ని పాడుచేయడమే కాకుండా.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ క్రమంలో.. సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉండండి.