NTV Telugu Site icon

Headache: ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా..? కారణాలివే

Headache

Headache

తలనొప్పి అనేది సాధారణ సమస్య. కొందరికి ఉదయం లేవగానే ఈ సమస్య మొదలవుతుంది. తలనొప్పి తగ్గేందు కోసం ప్రజలు తరచుగా మందులు తీసుకుంటారు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా..? మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి సమస్యతో బాధ పడుతుంటే, మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Read Also: Liam Livingstone: లివింగ్‌స్టోన్ ఊచకోత.. ఒకే ఓవర్‌లో 28 రన్స్

ఉదయం తలనొప్పికి కారణాలు..?
1) నిద్ర, తలనొప్పి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. నిద్రలేమి తలనొప్పికి కారణమైనట్లే, ఎక్కువ నిద్రపోవడం కూడా తలనొప్పికి కారణమవుతుంది.
2) తలనొప్పి, నిద్ర సమస్యలు ముడిపడి ఉన్నాయి. నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట టెన్షన్‌తో కూడిన తలనొప్పి వస్తుంది. ఒత్తిడి కూడా తలనొప్పికి కారణమవుతుంది. ఇది నిద్రను కష్టతరం చేసి తలనొప్పికి దారితీస్తుంది.
3) స్లీప్ అప్నియాతో బాధపడేవారు కూడా ఉదయం లేవగానే తలనొప్పి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

తలనొప్పి రాకుండా ఏం చేయాలి..?
1) ఈ సమస్యను నివారించడానికి మంచిగా నిద్ర పోవడం చాలా ముఖ్యం. సరైన సమాయానికి పడుకుని.. సరైన సమయానికి లేస్తే తలనొప్పి ఉండదు.
2) ఉదయం తీవ్రమైన తలనొప్పిని నివారించడానికి మైగ్రేన్‌ను నియంత్రించండి.
3) ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. దాని వల్ల తలనొప్పి వస్తుందంటే దానిని వదిలివేయడానికి ప్రయత్నించండి.
4) మంచి ఆహారం, తగినంత హైడ్రేషన్ ఈ సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. రోజంతా తగినంత నీరు త్రాగడానికి ప్రయత్నించండి. దీనితో పాటు.. ఉదయాన్నే ఒక పెద్ద గ్లాసు నీరు త్రాగాలి. మంచి ఆహారం కూడా తలనొప్పిని దూరం చేస్తుంది.

Show comments