Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crispy Ragi Murukku: సాయంత్రం టైంలో టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్స్ తినాలనిపిస్తే, ఆరోగ్యానికి మేలు చేసే రాగి పిండి మురుకులు ఒక అద్భుతమైన ఎంపిక తెలుసా. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ మురుకులను కేవలం 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్‌గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
రాగి పిండి: 3 కప్పులు (సుమారు 370 గ్రాములు)
పుట్నాల పప్పు పిండి: 1 కప్పు (మెత్తగా గ్రైండ్ చేసి జల్లెడ పట్టినది)
బియ్యప్పిండి: అర కప్పు (క్రిస్పీగా రావడం కోసం)
కారం: 1.5 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
వాము: 1 టీస్పూన్ (నలిపి వేయాలి)
తెల్ల నువ్వులు: పావు కప్పు
ఇంగువ: అర టీస్పూన్
వేడి చేసిన నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు (నెయ్యి ఇష్టం లేని వారు నూనె వాడుకోవచ్చు)
నీళ్లు: తగినన్ని
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం..
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో రాగి పిండిని తీసుకోండి. అందులోకి మెత్తగా గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు పిండిని జల్లెడ పట్టి వేయాలి. దీంతో మురుకులకు మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత బియ్యప్పిండి, కారం, ఉప్పు, వాము, నువ్వులు, ఇంగువ వేసి బాగా కలపాలి. తర్వాత అందులో బాగా వేడి చేసిన రెండు స్పూన్ల నెయ్యిని వేసి కలపాలి. పిండిని చేత్తో పట్టుకుంటే ముద్దలా అవ్వాలి, అప్పుడే మురుకులు కరకరలాడుతూ వస్తాయి. ఒకవేళ ముద్ద అవ్వకపోతే మరికొంచెం నెయ్యి లేదా నూనె వేయండి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. రాగి పిండి కాబట్టి పిండి కొంచెం మెత్తగా ఉంటేనే మురుకులు వేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి.
పిండి కలుపుకోవడం పూర్తి అయిన తర్వాత మురుకుల గొట్టానికి (జంతికల గొట్టం) కొంచెం నూనె రాసి, తగినంత పిండిని అందులో ఉంచాలి. నేరుగా నూనెలో వేయడం రాని వారు, ఒక చిల్లుల గరిటె వెనుక వైపు నూనె రాసి, దానిపై రౌండ్‌గా మురుకులా చుట్టుకోవాలి. బాగా వేడెక్కిన నూనెలో సిద్ధం చేసుకున్న మురుకులను మెల్లగా వదలాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా చక్కగా వేయించాలి. నూనెలో నురగ తగ్గిపోయిందంటే మురుకులు పర్ఫెక్ట్‌గా వేగినట్లే. మురుకులు వేసే ప్రతిసారి పిండి ఆరిపోకుండా చూసుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లి కలుపుకోవాలి. వీటిని గాలి తగలని డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజుల వరకు తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి. ఇందులో రుచితో పాటు క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కుదిరితే ఈ రాగి మురుకులను మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.
తాజావార్తలు
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!