Site icon NTV Telugu

Constipation Home Remedies: కడుపును శుభ్రపరిచే హోమ్ రెమిడీస్… తప్పక ట్రై చేయండి..

Constipation

Constipation

Constipation Home Remedies: మలబద్ధకం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు, వ్యాయామం చేయకపోవడం, శరీరానికి కావాల్సిన నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్యలు కలుగుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, నిద్ర లేమి, ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. కొన్ని రకాల మందులు, ముఖ్యంగా నొప్పి నివారిణలు, యాంటీ ఆసిడ్లు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. అలాగే డయాబెటిస్, థైరాయిడ్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా మలబద్ధకాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మీ కడుపు క్లీన్‌గా ఉండాలి. కడుపు క్లీన్‌ చేసే కొన్ని హోం రెమిడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

READ MORE: Himachal Pradesh: ఓ వీరుడి సోదరి వివాహాన్ని జరిపించిన సైనికులు.. అతిథులు కన్నీటిపర్యంతం

గోరువెచ్చని నీరు త్రాగాలి: ఉదయం లేవగానే ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరం విషాన్ని తొలగిస్తుంది. మలబద్ధకం లేని వారు సైతం ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగాలి.

అల్పాహారంలో ఓట్ మీల్ : ఓట్ మీల్ ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇందులో కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రేగులను శుభ్రపరచడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.

నానబెట్టిన బాదంపప్పులు: రాత్రిపూట నాలుగు నుంచి ఐదు బాదంపప్పులను నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినండి. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, వివిధ ఇతర ప్రోటీన్లను అందుతాయి. రోజూ నాలుగు నుంచి ఐదు బాదంపప్పులు తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తినండి: మీ అల్పాహారంలో ఆపిల్, అరటిపండ్లు వంటి ఫైబర్ అధికంగా ఉండే పండ్లను చేర్చుకోండి. ఇందులో విటమిన్- సీ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. విటమిన్ సీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నీరు పుష్కలంగా త్రాగండి: రోజంతా నీరు పుష్కలంగా త్రాగండి. తద్వారా శరీరం హైడ్రేటెడ్ గా ఉండి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది.

 

 

Exit mobile version