Blood Cancer: అత్యంత తీవ్రమైన క్యాన్సర్లలో ‘బ్లడ్ క్యాన్సర్’ ఒకటి. సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో వైద్యులు కీమోథెరపీని ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే, చండీగఢ్ వైద్యులు మాత్రం కీమోథెరపీ ఉపయోగించకుండా ఒక రకమైన రక్త క్యాన్సర్ చికిత్సను కనుగొన్నారు. అక్యూట్ ప్రోమిలోసైటిక్ లుకేమియా (ఏపీఎల్)తో బాధపడుతున్న రోగులు చికిత్స తర్వాత పూర్తిగా నయమయ్యారని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వైద్యులు తెలిపారు.
Read Also: POCSO Act : ఆ రోజు హోటల్‌లో డిన్నర్‌కు తీసుకెళ్లి గదిలో బలవంతంగా
15 ఏళ్ల పరిశోధన తర్వాత కీమోథెరపీ లేకుండా ఈ విజయం సాధించిన మొదటిదేశంగా భారత్ నిలిచిందని, బ్రిటిష్ జర్నల్ ఆఫ్ హేమటాలజీలో తన అధ్యయనంలో పేర్కొంది. “ATO (ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్) + ATRA (ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్) కలయికతో ఏపీఎల్‌ని సమర్థవంతంగా నయం చేయవచ్చని, అదనంగా కీమోథెరపీ కీమోథెరపీ అవసరం ఉండదని అధ్యయనం పేర్కొంది. హై రిస్క్ పేషెంట్లలో కీమోథెరపీని జోడించవచ్చని తెలిపింది. APL రోగులు ప్రస్తుతం కీమోథెరపీని మాత్రమే ఉపయోగించి చికిత్స పొందుతున్నారు. ఇది చాలా సైడ్ ఎఫెక్టులను కలిగి ఉంటుంది.