Site icon NTV Telugu

Brain Health Tips: మెదడు మొద్దుబారి పోతుందా..? చురుగ్గా పని చేయాలంటే ఇలా చేయండి..!

Brain Before Death

Brain Before Death

Brain Health Tips: మన శరీరంలో అత్యంత ప్రభావవంతమైన అవయవం మెదడు. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలను విశ్లేషించేదీ… నిర్ణయాలను చేసేది అదే. ఒక్కమాటలో చెప్పాలంటే మన శరీరంలో మెదడే హెడ్‌మాస్టర్‌. మన పూర్వీకులు చూడని ఎన్నో సంక్లిష్టతలను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోంది. ఫోన్లో నిరంతరం వచ్చిపడే నోటిఫికేషన్లు, ఆలోచనలు, పని సంస్కృతి వంటివి కుదురుగా నిలవనీయడం లేదు. దీంతో మెదడుపై ఒత్తిడి పడుతోంది. కాలక్రమంలో మెదడు మొద్దుబారి పోతుంది. మీ మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ చిట్కాలు పాటించండి..

READ MORE: Vijay Devarakonda : మళ్ళీ అవే కామెంట్లు.. విజయ్ అవసరమా..?

కొత్త భాషల్ని నేర్చుకోవడం అనేది మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ పని చేయడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉంటుందని 2020లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఏదో ఒక కొత్త భాషను ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం వల్ల మెదడుకు మేలు జరుగుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. కొందరు బజారు నుంచి ఏమైనా సరుకులు తెచ్చుకోవాలంటే వాటన్నింటితో ఓ లిస్ట్ రాసుకుని ఆ చీటీ పట్టుకుని మార్కెట్‌కి వెళతారు. అయితే మెదడును పదునుగా ఉంచుకోవాలంటే ఈ లిస్ట్ అంతటినీ గుర్తుంచుకుని దుకాణానికి వెళ్లండి. అక్కడ వీటన్నింటినీ తిరిగి గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. ఇలా క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుంది.

READ MORE: Hamas: టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్న “హమాస్” చీఫ్ భార్య..

ఎక్కడైనా రోజు వారీ పనుల్లో లెక్కలు చూడాల్సి వచ్చినప్పుడు మెదడులో లెక్కలు చేసేందుకు ప్రయత్నించండి. పెన్ను, పేపరు, కాలిక్యులేటర్‌ లాంటి వాటి సహాయం తీసుకోకుండా లోపలే ఈ పని చేయడం అనే దాన్ని అలవాటు చేసుకోండి. ఇది బ్రెయిన్‌కి ఎక్సర్‌సైజ్‌లా పని చేస్తుంది. అలాగే చదరంగం లాంటి ఆలోచనా శక్తి పెంచే ఆటలు ఆడటం చాలా మేలు చేస్తుంది. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు రకరకాల ఆహార పదార్థాలను తింటుంటాం కదా. వాటిలో ఏమేం పదార్థాలు వాడారో గుర్తించేందుకు ప్రయత్నించండి. వీటిలో వాడిన మసాలాలు, తాలింపులు సహా వీలైనన్ని ఎక్కువ పదార్థాలను గుర్తించండి. అప్పుడు మీ రుచి మొగ్గలు మరింత చురుగ్గా తయారవుతాయి.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version