NTV Telugu Site icon

Health Tips : ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే రోజూ ఈ డ్రింక్ ను తాగాల్సిందే..

Ragi Malt

Ragi Malt

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అతి చిన్న వయస్సులోనే చాలా మందికి చర్మం పై ముడతలు రావడం మనం చూస్తూనే ఉంటాం.. అందుకు కారణం శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందక పోవడం.. వాతావరణంలో మార్పులు.. ఆహారంలో మార్పులు.. అయితే పిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే కొన్ని హెల్త్ డ్రింక్స్ ను తప్పకుండ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఆ డ్రింక్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

మన శరీరానికి ఆరోగ్య కరమైన పోషకాలను అందించే వాటిలో తృణ దాన్యాలు కూడా ఉన్నాయి.. అందులో రాగులు కూడా ఉన్నాయి.. రాగులను ఏదొక రూపంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. రాగి ముద్ద, రాగి రోటీ, రాగి గంజి, రాగి అంబలి ఇలా పలు రకాలుగా తయారు చేసుకోని తీసుకుంటారు. మిల్లెట్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలను దృడంగా చేయడానికి సహాయపడుతుంది. రాగులు పిల్లల సరైన అభివృద్ధికి కూడా ఉపయోగపడుతాయి.. వృద్ధులు, మహిళలు ఎముకల బలానికి మంచి మెడిసిన్.. రాగి గంజిని రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాగుల్లోని పోషకాలు ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్లు ఎ, బి, సి, మినరల్స్ మన శరీరానికి బలాన్ని ఇస్తాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.. రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు ట్రిప్టోఫాన్, ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీని వినియోగం బరువును అదుపులో ఉంచుతుంది. మిల్లెట్ పిండితో చేసిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.. అలాగే గుండె సమస్యలను, ఉబ్బసం ఆయాసం వంటి వాటిని వెంటనే తగ్గిస్తుంది.. మిల్లెట్ ఫుడ్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తూ, మృదువుగా మారుతుంది… దీంతో నిత్య యవ్వనంగా కనిపిస్తారు.. మధుమేహన్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే రక్త హీనత సమస్యను దూరం చేస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.