beauty tips every woman must know: ఎంత ఖరీదైన కాస్మొటిక్స్ వాడినా ముఖం నిగారింపు కోల్పోతుందా? ఎన్ని లోషన్స్ మార్చినా కళతప్పుతుందా? అయితే చక్కటి సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ లను వేసుకోవడం ఉత్తమం. ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు క్లీనప్ చేసుకుని, స్క్రబ్ చేసుకుని, ఆవిరి పట్టించుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. షాలు –ఒక చెంచా, బియ్యప్పిండి – రెండు చెంచాలు, తేనె – సగం చెంచా. స్క్రబ్ : కొబ్బరి నూనె – మూడు చెంచాలు, చక్కెర – ఒకటిన్నర చెంచా, పసుపు- సగం చెంచా, పెరుగు – అర టీ స్పూన్ తీసుకోవాలి.
టమాటా జ్యూస్ – అర టేబుల్ స్పూన్, పుదీనా గుజ్జు – నాలుగు చెంచాలు, ముల్తాని మట్టి – రెండు చెంచాలు తీసుకోవాలి.. ముందుగా ఒక బౌల్ తీసుకుని పాలు, బియ్యప్పిండి, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనె, చక్కెర, పచ్చిపసుపు, పెరుగు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు టమాటా జ్యూస్, పుదీనా గుజ్జు, ముల్తాని మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి ఆపై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Peddapally Crime: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి.. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన