ప్రస్తుత రోజుల్లో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. కలుషిత గాలి వల్ల దగ్గు, జలుబు వంటి సాధారణ వ్యాధులు వస్తాయన్నది అందరికీ తెలుసు. అయితే వాయు కాలుష్యం చాలా తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుందని మీకు తెలుసా..? అవును, వాయు కాలుష్యం దగ్గు, గొంతు నొప్పి వంటి చిన్న సమస్యలే కాకుండా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. వాయు కాలుష్యం వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకుందాం.
ఊపిరితిత్తుల వ్యాధులు:
వాయు కాలుష్యం నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఇది ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కలుషితమైన గాలిలో ఉండే కణాలు ఊపిరితిత్తులలోకి వెళ్లి మంటను కలిగిస్తాయి.
గుండె జబ్బులు:
వాయు కాలుష్యం గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఇది గుండెపోటు, స్ట్రోక్, ధమనులు గట్టిపడటం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కలుషితమైన గాలిలో ఉండే హానికరమైన కణాలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి.. రక్తపోటును పెంచుతాయి.
క్యాన్సర్:
వాయు కాలుష్యానికి ఎక్కువగా గురికావడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా.. ఇది మూత్రాశయ క్యాన్సర్, రక్త క్యాన్సర్ వంటి ఇతర రకాల క్యాన్సర్లకు కూడా కారణం కావచ్చు.
నాడీ వ్యవస్థకు నష్టం:
వాయు కాలుష్యం నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా.. డిమెన్షియా, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
వంద్యత్వం:
వాయు కాలుష్యం ఒక వ్యక్తిలో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా గర్భం ధరించడంలో ఇబ్బంది లేదా గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది.
గర్భధారణ సమయంలో హాని:
గర్భిణీ స్త్రీలలో వాయు కాలుష్యం వల్ల నెలలు నిండకుండానే పుట్టడం.. శిశువు తక్కువ బరువుతో పుట్టడం లేదా పుట్టగానే మరణం వంటి సమస్యలను కలిగిస్తుంది.
పిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగించడం:
వాయు కాలుష్యం కారణంగా పెరుగుతున్న పిల్లల అభివృద్ధిని అడ్డుకుంటుంది.
వాయు కాలుష్య నివారణకు చర్యలు:
ఎయిర్ ప్యూరిఫైయర్ వాడకం: ఇది గాలిలో ఉండే హానికరమైన కణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించండి: బయటకు వెళ్లే ముందు మాస్క్ ధరించడం ముఖ్యం.
ధూమపానం చేయవద్దు: ధూమపానం వల్ల ఇంట్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతుంది.
అగరుబత్తీలు మొదలైనవాటిని కాల్చవద్దు: ఇంటి లోపల సువాసనగల కొవ్వొత్తులు, అగరుబత్తీలు మొదలైన వాటిని కాల్చవద్దు.