Site icon NTV Telugu

AIIMS Study: పడక సుఖం కోసం మందులు వాడుతున్న యువత.. సంచలన రిపోర్ట్..!

Aiim

Aiim

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఇటీవల ప్రచురించిన పరిశోధన ఓ పెద్ద ప్రమాదాన్ని లేవనెత్తింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ, 2025లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని ప్రజలు లైంగిక కార్యకలాపాల సమయంలో తమ బలాన్ని పెంచుకోవడానికి యువత అనేక రకాల మందులను ఉపయోగిస్తున్నారని తేలింది. ఈ మందులు వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఈ మందులు హెచ్‌ఐవీ(HIV), హెపటైటిస్ వంటి మానసిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతున్నాయి. AIIMS వైద్యులు ఈ అంశానికి కెమ్సెక్స్ అని పేరు పెట్టారు. ఈ పేరును కెమికల్, సెక్స్ అనే రెండు పదాలతో రూపొందించారు. వాస్తవానికి ఇప్పుడు విదేశాల మాదిరిగానే, భారత్‌లోని ప్రజలు కూడా ఈ ధోరణిని అనుసరిస్తున్నారని పరిశోధనలో వెల్లడైంది.

READ MORE: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కర్ ఉగ్రవాదులు ట్రాప్..

ఈ పరిశోధనను ఎయిమ్స్ ఢిల్లీలోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ (NDDTC) చేసింది. అదనపు ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధార్థ్ సర్కార్, ప్రొఫెసర్ డాక్టర్ అంజు ధావన్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ వర్ష ఈ అధ్యయనాన్ని AIIMS NDDTCలో నిర్వహించారు. ఈ సర్వేను సోషల్ మీడియా ద్వారా నిర్వహించారు. ఎయిమ్స్ ఢిల్లీ నిర్వహించిన మొదటి రకమైన ఆన్‌లైన్ అధ్యయనం ఇది. కనీసం ఒక్కసారైనా సెక్స్‌లో పాల్గొన్న 18 ఏళ్లు పైబడిన వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. సెక్స్‌కు ముందు డ్రగ్స్ తీసుకునే విధానం, దానితో సంబంధం ఉన్న ప్రమాదాలను ఇందులో కనుగొన్నారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్, ప్రజారోగ్యంపై పనిచేస్తున్న డాక్టర్ జుగల్ కిషోర్, ఈ అధ్యయనంలో వెలువడిన సమాచారం ఒక పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుందని చెప్పారు. భారతదేశంలో మారుతున్న లైంగిక, మాదకద్రవ్యాల ధోరణుల ప్రమాదకరమైన పరిస్థితిని AIIMS పరిశోధన ప్రదర్శిస్తోందని డాక్టర్ కిషోర్ అంటున్నారు. వీటిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం అవసరమని నొక్కిచెప్పారు. ఈ ధోరణి HIV కేసులను పెంచుతుందని వెల్లడించారు.

Exit mobile version